చంద్రబాబుపై కేసుల ఉపసంహరణ పై హైకోర్టులో కీలక పరిణామం...!!

చంద్రబాబు పై నమోదైన కేసులు మూసివేత పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో చంద్రబాబు పైన నమోదైన రెండు కేసులను మూసివేసారు. ఈ వ్యవహారం పైన హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ కేసుల కొట్టివేత సమయంలో న్యాయస్థానం అభ్యంతరాలను న్యాయస్థానాలు సరిగ్గా పట్టంచుకోలేదని పిటీషనర్ పేర్కొన్నారు. ఈ అంశం పైన విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు పైన రెండు కేసులను ఈ మధ్య కాలంలో మూసివేసారు. వైసీపీ హయాం లో చంద్రబాబు పై ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులు నమోదయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ ఏసీబీ కోర్టు కేసును మూసివేసింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.

the-high-court-ordered-for-submission-of-details-regarding-the-dismissal-of-cases-against-chandra-ba

ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో, ఇప్పుడు హైకోర్టులో ఇదే తరహాలో పిటీషన్ దాఖలు కాగా.. విచారణ సమయంలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులు ఎందుకు మూసివేసారు.. ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ కోసం ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

2014-19 నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీమెన్స్‌ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.3,356 కోట్ల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్‌ వాటా 90 శాతం, మిగతా పది శాతం ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. 2019లో వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు (క్రైం నంబరు 29/2021) నమోదు చేసింది. సీమెన్స్‌ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ కున్నా, దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు రూ.371 కోట్లు విడుదల చేసిందని, ఆ డబ్బులను చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారని సీఐడీ ఆరోపించింది.

ఈ అభియోగాలతో చంద్రబాబుతో సహా 37 మందిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చారు. చంద్రబాబు ప్రజాగళం యాత్రలో ఆయన నంద్యాలలో ఉన్నప్పుడు 2023 సెప్టెంబరు 9న సీఐడీ అధికారులు అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆయన 53 రోజులపాటు.. 2023 అక్టోబరు 31 వరకు రాజమహేంద్ర వరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది. ఆ కేసు మూసివేత పైన ఇప్పుడు హైకోర్టులో పిటీషన్ దాఖలు కావటంతో.. విచారణ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+