అమరావతి నిర్మాణంలో కులాల చరిత్ర బహిర్గతం చెయ్యాలి:ప్రభుత్వ విప్ డొక్కా
విజయవాడ:అమరావతి చైతన్య నిర్మాణంలో పాలుపంచుకున్న అనేక కులాల చరిత్ర, ఆయా సంస్కృతులను బహిర్గతం చేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన 'అమరావతి ఖ్యాతి - మాదిగల స్ధితి' పుస్తకావిష్కరణ విజయవాడ మొగల్రాజపురంలో జరుగగా ఈ కార్యక్రమానికి డొక్కా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ కల్చరల్ సెంటర్ లో మహాకవి జాషువా కళాపీఠం, విజయవాడ కల్చరల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా డొక్కా మాట్లాడుతూ ఏ రచన అయినా సమాజాన్ని చైతన్యపరచాలనే దిశలోనే ఇనాక్ రచనలు సాగాయని చెప్పారు.

గ్రంధ రచయిత, సాహితీవేత్త కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ అమరావతి స్థూపం నిర్మాణంలో మాదిగల పాత్ర గణనీయమైనదన్నారు. మాదిగ కులస్థుడైన కుడు ప్రజ్ఞాశాలి అని, గొప్ప కళాకారుడని తెలిపారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కొలువులో సైన్యాధిపతిగా రాజప్రతినిధిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన కొలకలూరు భుజంగ రాయుడు మాదిగ కులానికి చెందిన వాడేనని మాదిగల హక్కుల కోసం శాసనం వేసిన వీరుడని అతడు తనకు ముత్తాత కావడం గర్వకారణంగా ఉందన్నారు.
Recommended Video

ఈ కార్యక్రమంలో భాగంగా 'అమరావతి ఖ్యాతి - మాదిగల స్ధితి' పుస్తకాన్ని సమీక్షించిన డాక్టర్ వావిలాల సుబ్బారావు మాట్లాడుతూ దేశ సంస్కృతి నిర్మాణంలో వెలుగులోకి రాని కొన్ని కులాల చరిత్రను అధ్యయనం చేసే దిశగా ఇనాక్ రచన సాగిందని అన్నారు. ప్రముఖ బౌద్ధ రచయిత బొర్రా గోవర్థన్ మాట్లాడుతూ 2500 సంవత్సరాల నాడే బౌద్ధభిక్షువుల్లో దళితులు ఉన్నారని, అనేక రచనలు చేసిన వారి స్రవంతిలో భాగంగానే ఇనాక్ ఆ పరంపర కొనసాగిందని కొనియాడారు. కల్చరల్ సెంటర్ సిఈవో శివనాగిరెడ్డి మాట్లాడుతూ అమరావతిలోని పూర్ణఘట శిల్పంతో అలంకరించిన విధికుడు మాదిగలకు ఆదర్శపురుషుడని చెప్పారు.
విజయవాడ:అమరావతి చైతన్య నిర్మాణంలో పాలుపంచుకున్న అనేక కులాల చరిత్ర, ఆయా సంస్కృతులను బహిర్గతం చేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన 'అమరావతి ఖ్యాతి - మాదిగల స్ధితి' పుస్తకావిష్కరణ విజయవాడ మొగల్రాజపురంలో జరుగగా ఈ కార్యక్రమానికి డొక్కా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ కల్చరల్ సెంటర్ లో మహాకవి జాషువా కళాపీఠం, విజయవాడ కల్చరల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా డొక్కా మాట్లాడుతూ ఏ రచన అయినా సమాజాన్ని చైతన్యపరచాలనే దిశలోనే ఇనాక్ రచనలు సాగాయని చెప్పారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications