తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాల్లో అప్రమత్తం..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం లో మార్పు కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రోజు (సోమవారం) అల్పపీడనం ఏర్పడనుంది. రేపటికి మరింత బలపడి వాయుగండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తరువాత తుఫాన్‌గా మారుతుందని వెల్లడించింది. రానున్న రెండురోజుల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రేపటికి వాయుగుండగా మారి: తుఫాన్ గా మారిన తరువాత ఉత్తరంగా పయనించి ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10న రాత్రి లేదా 11నఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న దీవుల్లో తుఫాన్‌గా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈశాన్యంగా పయనించి తొలుత తీవ్ర తుఫాన్, తరువాత అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈ నెల 14న మయన్మార్ వద్ద తీరం దాటుతుందని పేర్కొన్నారు. ఇదిలావుండగా బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం బలపడనున్న క్రమంలో తూర్పుతీర రాష్ట్రాల్లో వర్షాలు పెరుగనున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్, ఒడిశాతోపాటు కోస్తాంధ్రలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తీర జిల్లాల్లో అప్రమత్తం: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో అప్రమత్తం అయ్యారు. కోస్తా, రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న రెండురోజుల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తూఫాను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ,మయన్మార్ తీరాల వైపు ప్రయాణిస్తుంది అయితే దిశా మార్చు కునే అవకాశం ఉందని , మోచా తుపాను దిశ మార్చుకుంటే కోస్తాంధ్ర వైపు కూడా ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా తీరా ప్రాంతాలను తాకే క్రమంలో దీనిప్రభావం తెలంగాణ రాష్ట్రపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది .

వర్షాలు..ఉష్ణోగ్రతలు: తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలుల తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది . గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరో వైపు ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదువుతున్నాయి. ఆదివారం నంద్యాలలో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజులు ఉత్తర కోస్తాలో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం 11 మండలాలు, మంగళవారం 15 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications