తిరుమలలో జగన్ కు అగ్నిపరీక్ష, ఆ పని చేస్తారా ? లేదా ?, టెన్షన్

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల శ్రీవారి లడ్డులు తయారు చేయడానికి జంతువుల కొవ్వుతో కలిపిన కల్తీ నెయ్యి ఉపయోగించాలని వివాదం చెలరేగిన సమయంలో జగన్ తిరుమల వెళ్తున్నారు. తన పైన పడిన నిందలకు సరైన సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత జగన్ పక్కా ప్లాన్ చేస్తున్నారని, అందుకే తిరుమల వెలుతున్నారని సమాచారం.

అయితే జగన్ తిరుమల పర్యటన వెలుతున్న సందర్బంగా వైసీపీ అధినేతను ఇరుకన పెట్టడానికి టీటీడీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా పక్కాప్లాన్ తో ఉన్నారని తెలిసింది. గతంలో సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన జగన్ అప్పట్లో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని, జగన్ తిరుమల సంప్రదాయాలను పక్కన పెట్టారని, తిరుమల సాంప్రదాయాలను అవమానించారని రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే.

The leaders of NDA parties are planning to corner former CM YS Jagan

తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగిన సమయంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్ అప్పట్లో డిక్లరేషన్ ఇవ్వలేద ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్న జగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏరోజు గౌరవించలేదని, కుటుంబ సమేతంగా వెళ్లి ఏరోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించ లేదని చాలా కాలం నుండి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ఇలాంటి సమయంలో తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని ఓ సాంప్రదాయం ఉందని, శ్రీ వెంకటేశ్వర స్వామిపైన అంత భక్తి, గౌరవం ఉంటే సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేతను సూటిగా ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్న జగన్, వైసీపీ నాయకులు కానీ ఇప్పటివరకు సీఎం చంద్రబాబు నాయుడు అడిగిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

సీఎం హోదాలో తిరుమలకు వెళ్లిన జగన్ కు డిక్లరేషన్ ఇవ్వాలని అప్పటి టీటీడీ చైర్మన్లు, టీటీడీ ఈవోలు కాని అడగలేదని తెలిసింది. అన్యమతస్తులు తిరుమలకు వెళితే వాళ్ళ దగ్గర కచ్చితంగా డిక్లరేషన్ తీసుకునే టీటీడీ అధికారులు ఆరోజు జగన్ దగ్గర ఎందుకు డిక్లరేషన్ తీసుకోలేదని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తిరుమల వెళ్తున్న మాజీ సీఎం జగన్ కు ఎలాంటి హోదా లేదు కనీసం ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేదని ఎన్డీఏ పార్టీల నాయకులు అంటున్నారు.

The leaders of NDA parties are planning to corner former CM YS Jagan

వైసీపీ ఎమ్మెల్యేగా తిరుమల వెళ్తున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారా, మాజీ సీఎంగా శ్రీవారిని దర్శించుకుంటారా అనే విషయంా ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, తిరుమలలో టీటీడీ పాలకమండలి కూడా లేకపోవడంతో ఇప్పుడు జగన్ తిరుమల పర్యటన ఎలా ఉంటుందనే విషయంపై చర్చ మొదలైంది.

ఓ పార్టీ ఎమ్మెల్యే హోదాలో జగన్ కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని, అందరికీ ఉండే నియమ నిబంధనలే ఆయనకు వర్తిస్తాయని టీడీపీకి, బీజేపీ, జనసేను చెందిన కొందరు నాయకులు అంటున్నారు. ఈనెల 28వ తేదీన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెలుతున్న జగన్ డిక్లరేషన్ ఇస్తారా ? ఇవ్వరా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో కూటమి నాయకులు, వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో అనే విషయం వేచిచూడాలి అని సామాన్య ప్రజలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+