వైసీపీలో ఎమ్మెల్సీ సందడి - కొత్తగా 14 మంది : ఆ ముగ్గురూ ఖరారు.. లిస్టులో ఉన్నదెవరు..!!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుత సభలో 14 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు...స్థానిక సంస్థల కోటాలో 11 మందిని భర్తీ చేయాలి. అందులో తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో ముగ్గురి నియామకానికి షెడ్యూల్ విడుదల చేసింది. అందులో వైసీపీ నుంచి డీసీ గోవిందరెడ్డి..టీడీపీ నుంచి మాజీ ఛైర్మన్ మహమ్మద్ షరీఫ్...బీజేపీ నుంచి సోము వీర్రాజు పదవీ విరమణ చేసారు. అదే విధంగా ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదలయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

శాసన మండలిలో పూర్తి ఆధిపత్యం దిశగా
గత వారం టీడీపీ పైన ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ ఎంపీలు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కోరారు. దీంతో..ఈ మొత్తం 14 స్థానాలకు ఎన్నికలకు జరిగితే అన్నింటినీ వైసీపీనే తమ ఖాతాలో వేసుకొనే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేసిన ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాల్లో ఒకటి డీసీ గోవిండరెడ్డికి తిరిగి రెన్యువల్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం జగన్ హామీ ఇచ్చారు. మిగిలిన రెండు స్థానాలతో పాటుగా స్థానిక సంస్థల కోటాలో 11 మందికి సంబంధించిన లిస్టు సైతం వైసీపీ అధినాయకత్వం సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ 14 మంది వైసీపీ నుంచి సభలో ఎంట్రీ ఇస్తే.. మొత్తం 58 మంది సభ్యులు ఉన్న ఏపీ శాసన మండలిలో 32 స్థానాల తో వైసీపీ అటు శాసన సభలో..శాసన మండలిలో పూర్తి మెజార్టీతో నిలుస్తుంది.

ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఖరారు
ఎమ్మెల్యే కోటాలో మిగిలి రెండు స్థానాలు రాయలసీమ ప్రాంతానికే చెందిన ఎస్సీ..మహిళ కు కేటాయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక, స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన 11 స్థానాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలలో రెండేసి, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, ప్రకాశంలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. వీటి కోసం ఆ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతీ సందర్భంలోనూ సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పక్కగా అమలు చేస్తున్న సీఎం జగన్..ఈ పదవుల విషయంలోనూ అదే ఫార్ములా అమలు చేయనున్నారు.

సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు పక్కా
ఇప్పటికే మండలి ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఈ ఎన్నికల తరువాత ఈ రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఈ స్థానాల భర్తీ పైన ఒక అంచనాతో ఉన్నారని తెలుస్తోంది. ఇక, తాజాగా ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేసిన ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లుకు తిరిగి పదవి దక్కనుంది. ఇక, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్ పేరు ఖాయం చేసారు. కృష్ణా జిల్లా నుంచి గన్నవరం నియోజకర్గ నేతలకే దక్కే అవకాశం ఉంది. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులలో ఒకరికి ఖాయంగా తెలుస్తోంది. రెండో స్థానం బీసీలకు దక్కనుంది.

ఆ జిల్లాల నుంచి పెరుగుతున్న పోటీ
తూర్పుగోదావరి జిల్లా నుంచి గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిన..తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారు అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా అనంత ఉదయ భాస్కర్ తో పాటుగా ఆకుల వీర్రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే...ఉరవకొండ పార్టీ ఇన్ ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డికి ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు లేదా బీసీ అభ్యర్థి కి ఖరారయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం ఇన్ ఛార్జ్ గా ఉన్న కె భరత్ కు ఖాయమని తెలుస్తోంది.

కుప్పం పైన స్పెషల్ ఫోకస్
కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. భరత్ తో పాటుగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు పేరు పరిశీలనలో ఉంది. విశాఖ నుంచి నామినేటెడ్ పదవి ఆశించిన వంశీకృష్ణ తో పాటుగా వరుదు కళ్యాణి కి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక, 2024 ఎన్నికలకు ముందుగానే సిద్దం కావాలని భావిస్తున్న సీఎం జగన్ ఈ ఎమ్మెల్సీ నియామకాలు పూర్తయితే..ఇక, కేబినెట్ ప్రక్షాళన పైన ఫోకస్ పెట్టనున్నారు.
Recommended Video

ఎమ్మెల్సీలు పూర్తయిన వెంటనే కేబినెట్ విస్తరణ
ఆ తరువాత పూర్తిగా పార్టీ - ప్రభుత్వం పూర్తిగా ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ ఖరారు చేసి..అమలు చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఈ నెల 2న బద్వేలు బై పోల్ ఫలితం వెల్లడి కానుంది. ఆ వెంటనే ముందుగా ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధులను ఖరారు చేస్తారని సమాచారం. దీంతో.. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు పైన ఆశలు పెట్టుకున్న అధికార పార్టీ నేతలు సీఎం నిర్ణయం పైన ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications