చంద్రబాబు ప్రారంభిస్తే జగన్ ముంచేశాడు, ఆ రోజు ఏం జరిగిందంటే ?, నిమ్మల

విజయవాడ వరదలకు మాజీ సీఎం జగనే కారణమని, ఆయన కారణంగానే ఈరోజు విజయవాడ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

2020లో జగన్ ప్రభుత్వం 198 పనులను రద్దు చేసిందని, అందులో బుడమేరుకు సంబంధించిన ఐదు పనులు కూడా ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు చంద్రబాబు నాయుడు 80 శాతం పూర్తి చేశారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేవలం 20 శాతం పనులు పూర్తి చేయలేక ఆ పనులను గాలికి వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

The minister accused Jagan Budameru of stopping the works during the YCP government

ఆరోజు జగన్ బుడమేరు డైవర్షన్ చానల్ పనులు పూర్తి చేసివుంటే బుడమేరుకు నేడు గండ్లు పడేవికాదని నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరుకు గండ్లు పడడం వల్లనే విజయవాడకు వరదలు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ఆయన చేసిన పాపాల ఫలితమే నేడు విజయవాడ ప్రజలకు శాపాలుగా మారాయని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

ప్రకాశం బ్యారేజీ సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. అలాంటి ప్రకాశం బ్యారేజ్ ను కూడా కూల్చడానికి జగన్ కుట్ర పన్నారని నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా బోట్లు కొట్టుకుపోతాయని తెలిసినా వాటి యజమానులు కేవలం ప్లాస్టిక్ నైలాన్ తాళ్లతో కట్టేసి ఆ బోట్లను వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

The minister accused Jagan Budameru of stopping the works during the YCP government

ఈ సంఘటనలో మొత్తం పరిశీలిస్తే ఇది కచ్చితంగా కుట్ర కోణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మంత్రి నిర్మల రామానాయుడు అన్నారు.ప్రకాశం బ్యారేజీ గేట్లను ద్వంసం చెయ్యడానికి ప్రయత్నించిన వారు ఎవరైనా సరే చట్టపరంగా వారి పైన చర్యలు తీసుకుంటామని, ఈ కేసుకు సంబంధించి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+