విజయవాడలో కరెంట్ పనులు పూర్తి చేస్తాము, ఇన్ని రోజులు ఓపికపట్టినందుకు థ్యాక్స్

భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. విజయవాడలో సాధారణ పరిస్థితి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు శుభ్రం చేశారు. డ్రైనేజ్ ల్లో పేరుకుపోయిన వరద మట్టిని బయటకు తీస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇళ్లలో నిలిచిపోయిన వరద నీటిని అగ్నిమాపక సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు దాదాపు ఇప్పటికే శుభ్రం చేశారు. విజయవాడలో వరదల కారణంగా పలు ప్రాంతాల్లో చీకటి మయం అయ్యాయి. విజయవాడలో సోమవారం సాయంత్రానికి సుమారు 95 శాతం పనులు పూర్తు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. సోమవారం సాయంత్రం మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో కలిసి సితార రోడ్, కబేలా సెంటర్, జక్కంపూడి తదితర ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు.

The Minister promised to complete the power supply works in Vijayawada by Tuesday

స్థానిక ప్రజల సమస్యల గురించి తెలుసుకొన్న మంత్రి గొట్టిపాటి ఆ త్వరలోనే మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వరదల దెబ్బతో విజయవాడలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, అన్ని సవాళ్లను ఎదుర్కొని ఇప్పటికే 95 శాతం విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశామని, మిగిలిన ఐదు శాతం పనులు మంగళవారం నాటికి పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.

వరదల కారణంగా మీరు పడుతున్న ఇబ్బందిని మేము అర్థం చేసుకున్నామని, ఇన్ని రోజులు మాకు సహకరించిన మీకు రుణపడి ఉంటామని ఒకరోజు ఓపిక పెడితే విజయవాడలో 100% విద్యుత్ పునరద్దరణ పనులు పూర్తవుతాయని, అధికారులు, సిబ్బంది ఆదిశగా పనులు వేగవంతం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్థానిక ప్రజలకు చెప్పారు. ఇదే సమయంలో ఆహారం, మంచినీరు, నిత్యవసర కిట్లు సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, డోలా వీరాంజనేయులు స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+