పోలింగ్ కు 57 డేస్ -జగన్ Vs కూటమి, కలిసొచ్చే దెవరికి..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తక్షణం కోడ్ అమల్లోకి వచ్చింది. మే 13న పోలింగ్ జరగనుంది. సరిగ్గా 57 రోజుల సమయం ఉంది. గత ఎన్నికల కంటే ఈ సారి దాదాపు నెల రోజులు ఆలస్యంగా పోలింగ్ జరగనుంది. అయితే, ఇప్పటికే పార్టీలు అభ్యర్దులు ఖరారు చేయటంతో ప్రచారం ప్రారంభించారు. అయితే 55 రోజుల పాటు ప్రచారం చేయటం అభ్యర్దులకు భారం కానుంది. ఈ సమయం ఏ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.
షెడ్యూల్ విడుదల
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లకు గడువు నిర్ణయించారు. మే 13న పోలింగ్ జరగనుంది. మే 11న ప్రచారం ముగియనుంది. అంటే ఖచ్చితంగా 55 రోజుల సమయం ఉంది. అయితే, ఈ సమయం పార్టీలకు మేలు చేస్తుందా..నష్టం చేస్తుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం అభ్యర్దులు..పార్టీలకు ప్రచారం ఖర్చు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే ఏపీలో ఈ సారి ఎన్నికల ఖర్చు భారీగా మారుతోందనే అభిప్రాయం ఉంది. అధికార వైసీపీ అభ్యర్దులు దాదాపు ఏడాది కాలంగా ప్రజల్లోనే ఉన్నారు. ఈ సమయం మరింత తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ జగన్ రోజుకు మూడు సభల చొప్పున ఎన్నికల ప్రచారం చేసేల ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
జగన్ Vs కూటమి
అటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, కేంద్ర మంత్రులు కూటమి తరపున ప్రచారానికి సిద్దమయ్యారు. కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఆలస్యం అయింది. తొలి రెండు విడతల్లో పోలింగ్ జరిగి ఉంటే ప్రచారానికి సమయం సమస్యగా మారేది. అయితే, ఇప్పుడు 55 రోజుల సమయం రావటం కూటమికి కొంత మేర కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
తమ పథకాల ను మరింతగా ప్రచారం చేసుకొనే సమయం దొరుకుతుంది. ఇదే సమయంలో మరో సమస్య కనిపిస్తోంది. బరిలో నిలిచే అభ్యర్దులకు మాత్రం ప్రచారం..కేడర్ నిర్వహణ ఖర్చుల మోత దడ పుట్టించటం ఖాయంగా కనిపిస్తోంది. అంచనాలకు మించి ఖర్చు తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కౌంట్ డౌన్ షురూ
జగన్ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. రోజుకు రెండు నుంచి మూడు సభల వరకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ, జనసేన బలం కనిపిస్తున్న నియోకజవర్గాల్లో ప్రచారానికి సిద్దమయ్యారు. అభ్యర్దుల ప్రకటన పూర్తి కావటంతో పూర్తిగా ప్రచారం పైనే ఫోకస్ చేయనున్నారు.
కోడ్ అమల్లోకి రావటంతో ఇక పూర్తగా నిర్ణయాధికారం ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తుంది. ఇక్కడ ప్రభుత్వం నామ మాత్రంగానే సాధారణ పాలనా వ్యవహారాలకు పరిమితం కానుంది. దీంతో,ఈ 57 రోజుల సమయం ఎవరు సద్వినియోగం చేసుకుంటారు. ఎవరికి టర్న్ అవుతుందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications