ఏపీ రాజధాని: ఆంధ్రుల రాజధాని, బౌద్ద నగరం.. ఇదీ అమరావతి! (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఉగాది పర్వదినం నాడే ఏపీ సీఎం చంద్రబాబు పేరును అమరావతిగా ప్రకటించాలనుకున్నప్పటికీ సమయాభావం వల్ల అది కుదరలేదని అంటున్నారు.
అమరావతి మంచి బౌద్ధ పుణ్యక్షేత్రం. కృష్ణా నది పక్కనే ఉంది. అమరావతిని సందర్శించేందుకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్దిస్టులు వస్తుంటారు. అక్కడ రెండువేల ఏళ్ల నాటి స్థూపం, ధాన్యకటక స్థూపం, చిన్న మ్యూజియం ఉన్నాయి. అమరావతిలో పలు మతాల సంగమం అని చెప్పవచ్చు. ఇక్కడ పలు మతాలకు చెందిన స్తూపాలు, శిల్పాలు ఉన్నాయి.
అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. ఇది గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ దక్షిణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమరావతికి దగ్గరలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ విజయవాడ. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు హైదరాబాద్. హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుండి విజయవాడకు వెళ్లి అటు నుండి అమరావతి వెళ్తుంటారు.

అమరావతి
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరుకు అతి సమీపంలోనే అమరావతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే చారిత్రక ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని, తెలుగువారి గత కీర్తిని చాటినట్లు అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.

అమరావతి
అమరావతి ప్రసిద్ధ క్షేత్రం. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతాన్ని పాలించారు.

అమరావతి
1795లో చింతపల్లి జమీందార్ ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి, సమీపంలో రాజధానిగా అమరావతిని నిర్మించారు.

అమరావతి
శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉంది. అమరావతి పైన పురాతన గాథలు కూడా ఉన్నాయి.

అమరావతి
అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది.

అమరావతి
ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతావనిని పరిపాలించారు.

అమరావతి
1795లో చింతపల్లి జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి దానికి సమీపంలో అమరావతి అనే నూతన రాజధానిని నిర్మించారు.

అమరావతి
శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉంది.

అమరావతి
ఇప్పుడు ఇది నవ్యాంధ్ర రాజధానిగా మారితే, ఆసియా ఖండంలోని వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అమరావతి
నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెడితే బౌద్ధ మత గురువు ద లైలామా ద్వారా ప్రత్యేక నిధులు వస్తాయనే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే.

అమరావతి
పురాణాల ప్రకారం... తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వేలాడుతున్న అమృత లింగాన్ని ఛేదించాడు. దాంతో, అమృత లింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి.

అమరావతి
ఇక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది.

నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెడితే బౌద్ధ మత గురువు దలైలామా ద్వారా ప్రత్యేక నిధులు వస్తాయనే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే.

అమరావతి
పురాణాల ప్రకారం... తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వేలాడుతున్న అమృత లింగాన్ని ఛేదించాడు. దాంతో, అమృత లింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి.

అమరావతి
ఇక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది.

Click it and Unblock the Notifications