కొత్త పోలీసుల కష్టాలు...మూడు నెలలుగా జీతాల్లేవు:మొదటి జీతం కోసం నిరీక్షణ!
అమరావతి:కొత్త కొలువు...అందులో పోలీసు ఉద్యోగం...కెరీర్ గురించి కోటి ఆశలతో రాష్ట్రంలో కొత్తగా పోలీసు కొలువులో చేరిన సుమారు ఆరు వేల మంది పోలీసులు ఓ కారణం చేత చిన్నబుచ్చుకుంటున్నారు.
ఆ కారణం...మూడు నెలలుగా వీరికి జీతం లేకపోవడమే....ఏ ఉద్యోగి అయినా మొదటి శాలరీ సెంటిమెంట్ తో ముడిపడి ఉంటుంది. మొట్టమొదటి కష్టార్జితాన్ని అమ్మ చేతుల్లో పెట్టి మురిసిపోవాలని ఓ కొడుకు కోరుకుంటే...మా అమ్మాయి కూడా సంపాదిస్తోంది అని నాన్న చెప్పుకోవాలని మరో కూతురు భావోద్వేగం...అయితే వీటన్నింటికీ ఆస్కారం లేకుండా చేయడమే కాకుండా...ఉద్యోగమొచ్చినా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడేలా చేస్తోంది మన ప్రభుత్వం అని బాధపడిపోతున్నారు మన కొత్త పోలీసులు. వివరాల్లోకి వెళితే...

కొత్తగా...పోలీసు కొలువులోకి
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొత్తం 5,886 మంది కానిస్టేబుళ్లు, 665 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరందరినీ మే మొదటి వారంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించారు. అలా వీరందరూ ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా వీరు ఉద్యోగంలో చేరి మూడో నెల పూర్తి కాబోతున్నా ఇంత వరకు ఒక్క జీతం కూడా అందుకోలేదంటే?...నమ్ముతారా?...కానీ ఇది నిజం.

ఎవరిని అడిగితే...ఏమవుతుందో?
కారణం పోలీస్ శాఖలో బాసిజం ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. అందులోనూ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు ఎవరిని అడిగితే ఏం జరుగుతుందోనని, జరుగుబాటు కష్టంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులతోనే కొలువులో కొత్త గా చేరిన రోజులు నెట్టుకొస్తున్నారు. జీతం ఎందుకు రావడం లేదని కొంతమంది ధైర్యం చేసి అడిగితే సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతుందని అధికారులు సమాధానం ఇస్తుండటంతో చేసేదేమీ లేక మిన్నుకుంటున్నారట.

కొందరికి ఊరట...శాశ్వత పరిష్కారం కాలేదు
అయితే ఇందుకు గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోని కొందరు సిబ్బంది మాత్రం మినహాయింపు అట...వారికి కొంతమేర జీతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తోన్న కొత్త కానిస్టేబుళ్లు సైతం తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని జీతాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల గౌతమ్ సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్‌గా రిలీవ్ అయ్యే ముందు ధైర్యం చేసి విజ్ఞప్తి చేశారట. దీనితో ఆయన కొత్తవారందరికీ తక్షణ ఖర్చుల కోసం రూ.2,500 చొప్పున మంజూరు చేయించారట. అయితే శాశ్వత పరిష్కారం మాత్రం ఇంకా లభించలేదని ఆవేదన చెందుతున్నారు.

సిఎఫ్‌ఎమ్‌ఎస్...కారణంగానే....
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లోని లోటుపాట్లు వల్లే కొత్తగా విధుల్లో చేరిన పోలీసులకు జీతాలు రావడం లేదని తెలుస్తోంది. కొత్తగా పోలీస్ శాఖకు వచ్చిన వారి సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉండగా చాలా మందికి ఇంత వరకు ఐడి కార్డు, ఎంప్లాయి నెంబర్ కూడా రాలేదు. అవి వచ్చిన తరువాత ఆధార్‌తో అనుసంధానిస్తే పూర్తి జీతాలు బ్యాంకులోనే పడతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు తమ బాధలపై దృష్టి సారించి ఇకనైనా నెలనెలా జీతాలు సక్రమంగా అందుకునేలా చర్యలు తీసుకోవాలని కొత్త పోలీసులు కోరుతున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications