ఏపీలో డోలాయమానంగా ప్రతిపక్షాలు..స్పష్టంగా జగన్ సైన్యం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచి వ్యూహాలు రచిస్తున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో వెళ్లాలని, వైసీపీ ని గద్దె దించాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తుంటే, వైసిపి ప్రజల మద్దతుతో ఈసారి ఎన్నికలకు బలంగా వెళ్లాలని సంక్షేమ పథకాలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది.

అయితే వైసీపీని ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్షాలలో క్లారిటీ లేదని, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదని, ప్రతిపక్ష పార్టీల నాయకులు రెండు చోట్ల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని నేతల మాటలను బట్టి అర్థమవుతుంది. ఇక ఇదే విషయాన్ని వైసిపి నాయకులు పదేపదే టార్గెట్ చేస్తున్నారు.

The opposition is in dilemma over the upcoming elections in AP.. YS Jagans army is clear over elections!!

వచ్చే ఎన్నికలలో వైసిపి సింగిల్ గా పోటీ చేస్తుందని, ప్రజలతోనే తమకు పొత్తు అని స్పష్టంగా వైసిపి నాయకులు చెబుతున్నారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీలకు ఏవిధమైన క్లారిటీ లేదని విమర్శిస్తున్నారు. వైసీపీ విధానం, నినాదం ఒక్కటేనని పేర్కొని, జనులంతా ఒకే కుటుంబం జనమంతా ఒకే నిలయమని ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని, ప్రజలే తమకు బలం అని స్పష్టం చేశారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయి అని దృఢమైన విశ్వాసంతో ఉన్నారు. ఇక తాజాగా మరోమారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతి పక్షాలలో క్లారిటీ లేని అనేక అంశాలను టార్గెట్ చేశారు.

వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీ నేతలు ఏం చేయాలో అర్థం కావడం లేదని, ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలు ఉన్నా, అవకతవకలు జరిగినట్టు గా ఆధారాలు ఉన్నా విపక్ష నేతల వెలికి తీయొచ్చు అన్నారు. సద్విమర్శలను ఆహ్వానిస్తామని, అవేవీ దొరకకపోతే ప్రతిపక్షాల నాయకులు మంచి పనులు ఏం చేయగలరో నమ్మశక్యంగా ప్రజలకు చెప్పొచ్చు అన్నారు .

అంతేగాని గంటకో మాట గది ఒక విమర్శ చేస్తూ తమ అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకుంటున్నారని, ఇది రాజకీయం కాదని విమర్శించారు.ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలలో క్లారిటీ లేదని, డోలాయమాన స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారని విమర్శించారు. సురక్షిత సీట్ల కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉందని ఎద్దేవా చేశారు.

రెండుచోట్ల కాకుండా ఒక్క సీట్లో మాత్రమే బరిలోకి దిగుతామని చెప్పే ధైర్యం లేదు వాళ్లకు అంటూ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను చెబుతున్నా. మా పార్టీ నుంచి ఎవరూ రెండు సీట్లలో పోటీ చేయరు అని స్పష్టంగా చెప్పారు. వైసీపీ నాయకులు ఇంత స్పష్టంగా చెప్తుంటే ప్రతిపక్ష పార్టీల అధినేతలలో కనీసం స్పష్టత లేదని తాజా పరిస్థితులతో అర్ధం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+