Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెద్దాయనకు ఇలా చేశారేంటి, జగన్ దెబ్బతో పెద్దిరెడ్డికి ఎఫెక్ట్, ఏం జరుగుతుందో ??

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులోనే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులకు ధైర్యం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పలు నియోజక వర్గాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం చక్రం తిప్పి ఎదురులేని మగమహారాజులుగా ఫీలైపోయిన వైసీపీ నాయకులకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో చుక్కలు చూపించారు. పవర్ ఉన్నంత వరకే మీరు లీడర్లు, మా చేతికి ఓటు అనే ఆయుధం ఇచ్చిన తరువాత మీ తలరాతలు తల్లకిందులు చేస్తామని ఓటర్లు మరోసారి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు నియోజక వర్గాల్లో ఓటర్ల దెబ్బకు వైసీపీ నాయకుల మైండ్ బ్లాక్ అయ్యింది.

The people of Punganur gave an unexpected shock to Minister Peddireddy

వైసీపీలో తిరుగులేని నాయకుడు, నాలుగైదు జిల్లాలో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పుంగనూరు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలుపు ఎలాగున్నా ఆయన మెజారిటీ మీద ఎక్కువ మంది బెట్టింగులు కట్టారు. అయితే ఓట్ల లెక్కింపు సందర్బంగా పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలు పెద్దిరెడ్డి వర్గానికి ఊహించని ఝలక్ ఇచ్చారు.

పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో ఆరవ రౌండ్ పూర్తి అయ్యే సరికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి 33, 389 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి (చల్లా బాబు)కు 30, 700 ఓట్లు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చల్లా రామచంద్రా రెడ్డి గట్టిపోటీ ఇవ్వడంతో ఆ విషయాన్ని పెద్దిరెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం 2, 689 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడంతో పెద్దిరెడ్డి వర్గీయులు హడలిపోయారు.

The people of Punganur gave an unexpected shock to Minister Peddireddy

పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 50 వేల మెజారిటీకి పైగా వస్తుందని చాలా మంది బెట్టింగులు కట్టారు. అయితే ఇప్పుడు కేవలం 5 వేల మెజారిటీ కూడా ఎక్కువగా లేకపోవడం, పలు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి గట్టి పోటీ ఇస్తుండటంతో పెద్దిరెడ్డి వర్గీయులు అయోమయంలో పడిపోతున్నారు. ఇక పుంగనూరులో బీసీవైపీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కు కేవలం 2, 120 ఓట్లు మాత్రమే రావడంతో ఆయనకు కనీసం డిపాజిట్ అయినా దక్కుతందా ? లేదా అని చర్చ మొదలైయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+