ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్ పేరు- హైకోర్టు ఏం చెప్పింది : కేంద్రం లేఖ వివరాలు ఇవ్వండి...!!
ఏపీలో సంక్షేమ పధకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టటం పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. సీఎం జగన్..రాజకీయ నేతల పెట్టి వ్యక్తిగత ప్రచారం, ప్రయోజనం పొందడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ ఈ పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తూ వ్యక్తిగత పేర్లు ఎలా పెడతారంటూ పిటీషన్ లో పేర్కొన్నారు. దీని పైన విచారణ చేపట్టిన హైకోర్టు పథకాల పేర్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం, పెట్టిన పేర్లను పరిశీలించి ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది.

చట్ట విరుద్దం ఎలా అవుతుంది
సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం ఎలా చట్ట విరుద్ధం అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ పథకాలకు రాజకీయ నేతల పేర్లు పెడుతున్నారని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేర్లు పెడుతున్నారని, తద్వారా ప్రజలను ఆకర్షించడంతో పాటు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమరావతి జేఏసీ నేత డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో ఈ ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

వ్యక్తిగత ప్రచారం కోసమేనంటూ
పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ, హోదా పేరుతో కాకుండా వ్యక్తిగత పేర్లను పథకాలకు పెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి తన పేరును పథకాలకు పెడుతూ వ్యక్తిగత ప్రచారం పొందుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపింది. సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం ఎలా చట్ట విరుద్ధం అవుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ ఏ పార్టీకి చెందిన వారని ధర్మాసనం ప్రశ్నించింది.
Recommended Video

దురుద్దేశాలు ఉండకూడదని వ్యాఖ్యల
ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండరాదంది. సదుద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేశామని ప్రసాద్ బాబు తెలిపారు. వ్యక్తిగతంగా పేర్లు పెట్టడంపైనే తమ అభ్యంతరమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆర్థిక సాయంతో అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పేర్లు పెట్టుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ లేఖలోని వివరాలను కూడా తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications