చంద్రబాబు కేసులో అసలైనోడు చిక్కాడు, చిక్కడు దొరకడు, భలే అసాధ్యుడు
టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. చైతన్య అలియాస్ పానుగంటి చైతన్య ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. వైసీపీ ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో ఓ వెలుగు వెలిగిన చైతన్య టీడీడీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్నాడు. చైతన్య కోసం పోలీసులు గాలించారు.
టీడీపీ ప్రధాన కార్యాలయం కేసులో ప్రధాన నిందితుడు అయిన చైతన్య సార్వత్రిక ఎన్నికల సందర్బంలో గుంటూరులో హల్ చల్ చేశాడు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వైసీపీ ఓటమిపాలైందని గుర్తించి తరువాత ఆ పార్టీ నాయకుడు చైతన్య గుంటూరు వదిలేసి ఎవ్వరికీ కనిపించకుండా మాయం అయ్యాడు. చైతన్యను స్థానికులు కూడా చివరిసారి ఏఎన్ యూ దగ్గర చూశారని పోలీసులు అంటున్నారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు అయిన పానుగంటి చైతన్య కోసం పోలీసులు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో గాలిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్న చైతన్య ముఖానికి ముసుగు వేసుకుని కోర్టులోకి వచ్చి న్యాయమూర్తి ముందు లొంగిపోయాడు. చైతన్య కోర్టులో న్యాయమూర్తి ముందు లొంగిపోయాడని తెలుసుకున్న పోలీసులు సైతం షాక్ అయ్యారని తెలిసింది.

టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో చైతన్యను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నాయకుల పేరుతో పుట్టిన రోజు వేడుకలు, వారి పర్సనల్ కార్యక్రమాలు జోరుగా నిర్వహించిన చైతన్య అతి తక్కువ కాలంలోనే ఆ పార్టీ నాయకులకు దగ్గర అయ్యాడని స్థానికులు, పోలీసులు అంటున్నారు. వైసీపీ కార్యక్రమాలకు కాలేజీ కుర్రాలను తరలించడంలో దిట్ట అయిన చైతన్య వైసీపీ హైకమాండ్ ను ఆకర్షించాడు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చెయ్యడానికి చైతన్య కొంత మంది కాలేజ్ అబ్బాయిలను పిలుచుకుని వెళ్లాడని, ఈ కేసులో అతనే ప్రధాన నిందితుడు అని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications