కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ - పక్కా ఆధారాలు, నెక్స్ట్ ఇక..!!

సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇందులో వాస్తవాల ను వెలుగు తీసేందుకు సిట్ సుదీర్ఘ విచారణ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ టీటీడీ నుంచి నెయ్యి సరఫరాదారులతో పాటుగా అనేక మందిని ప్రశ్నించింది. మరి కొందరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. కాగా, సిట్ విచారణ ఈ వ్యవహారంలో దాదాపు పూర్తయింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్దమైంది. ఈ వ్యవహారంలో సిట్ దాఖలు చేసే ఛార్జ్ షీట్ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణల పైన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణ పూర్తి చేసింది. ఈ కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్దం అయింది. గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. తొలుత తమిళనాడులోనే కేసు మూలాలు ఉన్నాయని దర్యాప్తు బృందాలు భావించాయి.

the-sit-likely-to-file-the-charge-sheet-in-laddu-adulteration-case-in-next-week

తీగలాగితే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌ల డొంక కదిలింది. వారినే కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల ప్రమేయం పైన సిట్ లోతుగా విచారణ చేసింది. టీటీడీలో కీలక పదవుల్లో ఉన్నవారితో సహా పలువురిని సిట్ విచారణ చేసింది. స్వయంగా నెయ్యి వినియోగం సమీక్షించింది. నెయ్యి కల్తీ విధానాన్ని గమనించింది. కావాల్సిన సమాచారం పైన ఆరా తీసింది.

టీటీడీ మాజీ ఈవో శ్యామల రావుతోనూ చర్చించింది. కావాల్సిన సమాచారం సేకరించింది. కాగా... కల్తీ నెయ్యికి రసాయనాల కొనుగోళ్లు, టీటీడీ నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు? కల్తీ నెయ్యి అని తెలిసినా.. తిరుమలకు ఎవరు అనుమతించారనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిగింది. తొలి ఛార్జ్‌షీటులో 24 మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బృందాలు.. మరో 12 మంది హస్తం ఉన్నట్టు కోర్టుకు తెలిపాయి. కాగా.. ఇప్పుడు సిట్ దాఖలు చేసే ఛార్జ్ షీట్ లో ఎవరి పేర్లు ప్రస్తావనకు రానున్నాయి... సిట్ విచారణలో భాగంగా ఏం తేల్చింది.. ఎవరి ప్రమేయం ఏంటి అనేది ఇందులో వివరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు సిట్ దాఖలు చేయబోయే ఛార్జ్ షీట్ పైన రాష్ట్రంతో పాటుగా దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+