శ్రీవారి భక్తులు అలర్ట్: టీటీడీ సర్వదర్శనం టోకెన్ కౌంటర్ మూసివేత..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 84,797 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,497 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

రద్దీ భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ మూత పడింది. శ్రీవారి మెట్టు వద్ద ఎస్ఎస్‌డీ కౌంటర్‌లో అంతరాయం ఏర్పడిందని, ఫలితంగా తాత్కాలికగా దీన్ని మూసివేయాల్సి వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల గిరుల్లో కురస్తోన్న భారీ వర్షాల కారణంగా నెట్‌వర్క్ వ్యవస్థ స్తంభించిందని వివరించారు.
భారీ వర్షాల వల్ల శ్రీవారి మెట్టు వద్ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్ దెబ్బతిన్నది. కేబుల్ నెట్‌వర్క్ దాదాపుగా గంటన్నరపాటు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల సర్వదర్శనం టోకెన్ల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడింది. టీటీడీకి చెందిన ఐటీ విభాగం సిబ్బంది మొబైల్ నెట్‌వర్క్ ద్వారా నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయినప్పటికీ- మొబైల్ సిగ్నల్స్ సరిగా అందకపోవడం వల్ల అది విజయవంతం కాలేదు.
ఒకవంక- భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, టీటీడీకి చెందిన ఐటీ విభాగం, విపత్తుల నిర్వహణ సిబ్బంది.. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మరమ్మతు పనులు చేపట్టారు. దీన్ని సరిచేశారు. మళ్లీ కౌంటర్ కార్యకలాపాలను యధాతథంగా పునరుద్ధరించేంత వరకు భక్తులు http:// t.tptblj.in/g ద్వారా తిరుమలలో దర్శనం, వసతి గదుల బుకింగ్ కోసం మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications