రాజధాని అమరావతి కేసులో సుప్రీం కీలక నిర్ణయం..!!

ఏపీ రాజధాని అమరావతి కేసు ఈ రోజు సుప్రీంలో విచారణకు వచ్చింది. రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పు స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వటం సహేతుకం కాదని పేర్కొంది. దీని పైన కొంత కాలంగా సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. ఇక, ఈ రోజు విచారణ తరువాత సుప్రీంకోర్టు ప్రతివాదులు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.

ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు పైన సుప్రీంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్ కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాని సూచించింది.

The Suprme court posted Amaravati Case trail for April, ordered Respondents to file counter

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే ఏడాది డిసెంబర్ లో మూడు రాజధాను ప్రతిపాదన చేసారు. ఈ దిశగా చట్ట సభల్లో బిల్లులు తీసుకొచ్చారు. హైకోర్టులో విచారణ వేళ ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుంది. తరువాత తీర్పు ఇచ్చిన హై కోర్టు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆదేశిస్తూ...కాల పరిమితిని నిర్దేశిస్తూ స్పష్టత ఇచ్చింది.

ఈ తీర్పు పైన సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం తన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని పేర్కొంది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టాలనికి తప్పుడు అర్దాలు చెబుతున్నారని వివరించింది.

రాష్ట్ర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని రాజధానిని కేవలం అమరావతికే పరిమితం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని నివేదికలు సూచించిన అంశాన్ని సుప్రీంకు వివరించింది. 2014-19 కాలంలో అమరావతి ప్రాంతంలో 10 శాత మౌలిక వసతలు పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ కోసం ఏప్రిల్ కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+