కడప జిల్లాలో పుట్టి అదే కడపకు ద్రోహం చేసిన జగన్, బెంగళూరు నుంచి రావాలంటే ఎలా ?
బెంగళూరులో నివాసం ఉంటున్న రాయలసీమలోని కడప, అన్నమయ్య జిల్లా ప్రజలను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, ప్రజల అవసరాలను తీర్చకుండా వారి సమస్యలను గాలికి వదిలేసిన జగన్ ప్రభుత్వం నాటకాలు ఆడిందని కడప లోక్ సభ నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో పుట్టిన వైఎస్ జగన్ అదే కడపకు ద్రోహం చేశాడని భూపేష్ రెడ్డి ఆరోపించారు.
రాయలసమీకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఐటీ హబ్ బెంగళూరులో నివాసం ఉంటున్నారని భూపేష్ రెడ్డి గుర్తు చేశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న మదనపల్లె, కడప, పులివెందుల, రాయచోటి, రాజంపేట, కదిరి, పీలేరు, వాల్మీకిపురం, పుంగనూరు, సదుం, సోమల, కలికిరి, వాల్మీకిపురం, తంబళపల్లె తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇప్పటికే బస్సుల్లోనే సంచరిస్తున్నారని టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి అన్నారు.

బెంగళూరు-కడపకు రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి చెయ్యడమే తన లక్షం అని భూపేష్ రెడ్డి అంటున్నారు. కడప జిల్లాకు జగన్ చేసింది ఏమీ లేదని, ఇదే కడప జిల్లాలో పుట్టిన జగన్ మా జిల్లా ప్రజలకు మేలుకంటే ఎక్కువ ద్రోహం చేశాడని భూపేష్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆయన సొంత నియోజక వర్గం పులివెందులకు అయినా న్యాయం చేశారా ? అని భూపేష్ రెడ్డి ప్రశ్నించారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కలికిరి పర్యటనకు వచ్చిన సందర్బంలో ఆయనతో తాను మాట్లాడానని, బెంగళూరు- కడప రైల్వే ప్రాజెక్టు గురించి మాట్లాడానని, తొలి ప్రధాన్యత ఇదే రైల్వే ప్రాజెక్టుకు ఇస్తామని మోదీ తనకు చెప్పారని భూపేష్ రెడ్డి అన్నారు. తాను ఎంపీగా విజయం సాధించిన వెంటనే బెంగళూరు- కడప రైల్వే ప్రాజెక్టుకు అనుమతి తీసుకుంటానని, తరవాత కడప స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, కడప జిల్లాలో రౌడీయిజాన్ని అంతం చేస్తామని కడప లోక్ సభ నియోజక వర్గం టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు.
ఓ ప్రైవేట్ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి కడప జిల్లాలోకు చెందిన సీఎం వైఎస్ జగన్ మా జిల్లాకు చేసిన మేలు ఏమీలేదని ఆరోపించారు. కనీసం కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు మంజూరు చేయించుకోలేని జగన్ సీఎంగా పని చేసి ఏం ఉపయోగం అని భూపేష్ రెడ్డి వైసీపీ నాయకులను ప్రశ్నించారు. బెంగూరు-కడప రైల్వే ప్రాజెక్టు మాకు అవసర లేదని సీఎం జగన్ స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారని భూపేష్ రెడ్డి ఆరోపించారు












Click it and Unblock the Notifications