ఆంధ్ర శబరిమలలో ఆదియోగి, అరుదైన ఘట్టం - ఎన్నో ప్రత్యేకతలు..!!

ఏపీలో మహాశివరాత్రి వేళ మరో అద్బుతం ఆవిష్కృతం కానుంది. ఆంధ్ర శబరిమలుగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి నాడు 60 అడుగు ల ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం దేశంలోనే మూడో అతి పెద్దదిగా రికార్డు నెలకొల్పుతోంది. మహాశివరాత్రి నాడు ఆవిష్కరణ కానున్న ఈ విగ్రహ ఏర్పాటు లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అరుదైన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మహా శివరాత్రి వేళ
ఏపీలో అత్యంత పెద్ద దైన ఆదియోగి విగ్రహ నిర్మాణం పూర్తి అయింది. మహా శివరాత్రి పండగ సందర్భంగా ఈ ఆదియోగి విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. ఇప్పటి వరకు బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి విగ్రహాలు ఉన్నాయి. కాగా, ఇప్పుడు దేశంలోనూ మూడో అతి పెద్ద ఆదియోగి విగ్రహం ఇక్కడ ఏర్పాటైంది. ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో మూడో అతిపెద్ద విగ్రహం రూపుదిద్దుకుంది. మహాశివరాత్రి నాడు ఉదయం ఈ విగ్రహం ఆవిష్కరించనున్నారు.

The third largest Adiyogi staute to launch on mahasivatri in Adipudi

ఎన్నో ప్రత్యేకతలు
ఈ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విగ్రహ వెనుక భాగంలో ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంది, ఇది లోపలి గర్భగుడిలోకి దారితీస్తుంది, ఇక్కడ శివలింగం ప్రతిష్టించబడింది, ఇది భక్తులకు ధ్యానం చేయడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది. దాని ముందు భాగంలో, నమస్క రించే భంగిమలో వినాయకుడు మరియు కుమారస్వామి విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. అదే విధంగా, ఎనిమిది మంది గౌరవనీయులైన ఋషులు - వశిష్ట మహర్షి, అత్రి మహర్షి, గౌతమ మహర్షి, కశ్యప బ్రహ్మర్షి, భరద్వాజ మహర్షి, జమదగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి మరియు వాల్మీకి - ధ్యానం చేస్తున్న బొమ్మలు విగ్రహం చుట్టూ ఉన్నాయి.

దేశంలోనే మూడో విగ్రహం
ఆదియోగి విగ్రహాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశారు. ఆదియోగి విగ్రహానికి ఎదురుగా వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు నమస్కరిస్తున్నట్లు ఏర్పాటు చేశారు. సుమారు రూ.40 లక్షలతో విగ్ర హం ఏర్పాటు చేసారు. విగ్రహం తయారీకి 9 నెలలు పట్టింది. ఇందుకోసం 1200 బస్తాల సిమెం టు, 5 టన్నులు ఇనుము వినియోగించారు. సిమెంటులో నలుపు రంగు మెటీరియల్‌ కలిపి వాడా రు. దీంతో ఈ విగ్రహం రంగు సుమారు 15 సంవత్సరాల వరకు మారదని నిర్వాహకులు చెబు తున్నారు. దీంతో, ఇప్పుడు ఈ విగ్రహం గోదావరి జిల్లాల్లో ఏర్పాటు ద్వారా దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+