రోజా అడ్డా నగిరి నెంబర్ వన్, కుప్పంలో ?, పోలింగ్ రోజు జరిగింది ఇదే, వామ్మో అంతనా !

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమల పుణ్యక్షేత్రం ఉంది. రాహుకేతు పూజలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తి, కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయకుడి ఆలయం కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తూరు జిల్లా మూడు ముక్కలు అయ్యింది.

చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళపల్లె అసెంబ్లీ నియోజక వర్గాలు అన్నమయ్య జిల్లాలో కలిసిపోయాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా విడిపోయి ఆ జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాలు మూడు జిల్లాలో ఉన్నాయి. అయినా చిత్తూరు జిల్లా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇదే చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మంత్రి ఆర్ కే రోజా నియోజక వర్గాలు ఉన్నాయి.

The voting percentage recorded in city and urban areas in Chittoor district is as follows

చిత్తూరు జిల్లాలో ఓటు శాతం పెంచాలని ఎన్నికల అధికారులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చిత్తూరులో 90 శాతం ఓటింగ్ జరిగేలా ఎన్నికల అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓటర్లు ఎక్కువగా ఉన్న చిత్తూరు నగరంలో అయితే మరిదారుణంగా తయారైయ్యిందని వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలో ఎక్కువ శాతం ఓటింగ్ జరిగిన మునిసిపాలిటీగా నగిరి రికార్డులకు ఎక్కింది.

చిత్తూరు జిల్లాలోని పట్టణ, పుర, నగరాల్లో ఓటింగ్ శాతం పెంచాలని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారులు భారీగా ఫెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. చిత్తూరు జిల్లాలోని మూడు పురపాలక సంస్థల పరిధిలో 80 శాతం దాటి పోలింగ్ జరగలేదని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో మిగిలిన చోట్ల 77 శాతం నుంచి 79 శాతం వరకు మాత్రమే పోలింగ్ జరిగింది.

అయితే నగిరిలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడంతో చిత్తూరు నగరంలో అతి తక్కువగా పోలింగ్ జరిగిందని వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలో చిత్తూరు నగరంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్నా అక్కడే తక్కువ శాతం ఓటింగ్ జరిగిందని వెలుగు చూసింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో తక్కువ శాతం ఓటింగ్ జరిగిన నియోజక వర్గాలు, ఎక్కువ శాతం ఓటింగ్ జరిగిన నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరగిగెడుతున్నాయి.

The voting percentage recorded in city and urban areas in Chittoor district is as follows
* ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం పట్టణంలో 18, 721 మంది పురుషులు ఉంటే వారిలో 15, 703 మంది ఓటు వేశారు. స్త్రీలు 20, 294 మంది ఉంటే వారిలో 16, 917 మంది మాత్రమే ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు.

* పలమనేరు పట్టణంలో పురుషులు 20, 264 మంది పురుఫులు ఉంటే వారిలో 16, 004 మంది మాత్రమే ఓటు వేశారు. స్త్రీలు 21,306 ఓటర్లు ఉంటే వారిలో 16, 773 మంది మాత్రమే ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు.

* పుంగనూరు పట్టణంలో పురుషులు 21,102 మంది ఉంటే అందులో 16,887 మంది ఓటు వేశారు. స్త్రీలు 22,517 మంది ఉంటే అందులో 17,970 మంది ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు.

* చిత్తూరు నగరంలో పురుషులు 69,391 మంది ఉంటే అందులో 54,197 మంది ఓటు వేశారు. స్త్రీలు 73,864 మంది ఉంటే అందులో 57,208 మంది మాత్రమే ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు.

* పుత్తూరులో 19,534 మంది పురుషులు ఉంటే అందులో 16,187 మంది ఓట్లు వేశారు. స్త్రీలు 20,663 మంది ఉంటే అందులో 17,970 మంది మాత్రమే ఓట్లు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు.

* మంత్రి రోజా నియోజక వర్గం నగిరి పట్టణంలో 23,847 మంది పురుఫులు ఉంటే వారిలో 20,081 మంది మాత్రమే ఓటు వేశారు, స్త్రీలు 24,176 మంది ఉంటే అందులో 20,421 మంది ఓటు వేశారని ఎన్నికల అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో నగరి పట్టణంలోనే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం మీద చిత్తూరు జిల్లాలోనే రోజా సొంత నియోజక వర్గం నగిరిలో ఎక్కువ శాతం ఓటింగ్ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+