జగన్ సభలో జేబుదొంగలు, ధర్నాపై వెంటనే దేవినేని కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

జంగారెడ్డిగూడెం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిలో నిర్వహించిన సభలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. జాగ్రత్తగా వ్యవహరించిన వైసిపి కార్యకర్తలు దొంగలకు బడితెపూజ చేశారు.

జగన్ బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఓ వైపు జగన్ ఉద్వేగంగా మాట్లాడుతుంటే.. అక్కడకు వచ్చిన ప్రజలు ఆసక్తిగా వింటున్నారు. ఇలాంటి సమయంలో దొంగలు రెచ్చిపోయారు. పలువురు జేబుల్లోని పర్సులను కొట్టేసే ప్రయత్నం చేశారు. వైసిపి కార్యకర్తలు మాత్రం అప్రమత్తంగా ఉంటి వారిని చితక్కొట్టి, పోలీసులకు అప్పగించారు.

Also Read: ఏదో జరుగుతోంది, తెలంగాణ కంటే ఎక్కువా: 'పవర్' లెక్క చెప్పిన బుగ్గన

జగన్ వ్యాఖ్యలకు దేవినేని కౌంటర్

వైయస్ జగన్ వ్యాఖ్యల పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పందించారు. జగన్ విమర్శల పైన అంతే వేగంగా దేవినేని పరోక్షంగా స్పందించారు.

Theft in YS Jagan's meeting at Jangareddygudem

పట్టిసీమ నుంచి గోదావరి జలాలు త్వరలోనే కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తాయన్నారు. అవినీతి పార్టీగా ముద్రపడ్డ వైసీపీకి ధర్నాలు చేసే హక్కు లేదన్నారు. జగన్ ఇలాకా పులివెందులకు నీరిచ్చే కాలువలను అడ్డుకుంటూ వైసిపి అభివృద్ధి నిరోధక పార్టీ అవతారమెత్తిందన్నారు.

Also Read: రాజకీయ వ్యవస్థపై జగన్ ఆసక్తికర వ్యాఖ్య, బాబుపై ఫైర్

అంతకుముందు, బందర్ పోర్టు నిర్మాణం పైన మాట్లాడుతూ.. దీని పైన విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బందర్ పోర్టును కృష్ణా జిల్లా ప్రజలు పోరాటాలు చేసి సాధించుకున్నారని చెప్పారు. ఇప్పుడు పోర్టు నిర్మాణానికి అడ్డుపడటం విడ్డూరమన్నారు. భూకబ్జాదారుడు ధర్మాన ప్రసాద రావు పోర్టు విషయంలో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి 14వేల ఎకరాలు మాత్రమే తీసుకున్నామని, 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ ఉద్యమిస్తామనడం విడ్డూరమన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Theft in YS Jagan's meeting at Jangareddygudem.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి