లోకేష్ పర్యటనలో జేబుదొంగ, లక్ష కొట్టేశారు: బస్సు నడిపిన బాలకృష్ణ
చిత్తూరు/అనంతపురం: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పర్యటనలో మంగళవారం నాడు జేబుదొంగలు హల్ చల్ చేశారు. లోకేష్ కార్యకర్తల సంక్షేమ యాత్రను ఉదయం ప్రారంభించారు. ఇందులో భాగంగా పుంగనూరుకు చేరుకున్నారు.
పుంగనూరులో రాజశేఖర్ అనే టీడీపీ నాయకుడి నుండి జేబుదొంగలు లక్ష రూపాయలు కొట్టి వేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై రాజశేఖర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన జేబు నుండి ఎవరో రూ.1 కొట్టేశారని ఆయన ఫఇర్యాదు చేశారు.

బాలకృష్ణ బిజీబిజీ
హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ మంగళవారం ఉదయం నుంచి బిజీబిజీగా గడిపారు. ఉదయం కొడికొండ చెక్‌పోస్టు నుంచి చిలమత్తూరు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.
11 గంటల సమయంలో మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీలో సుజల స్రవంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లేపాక్షి చేరుకున్న బాలయ్య దుర్గామాత ఆలయాన్ని సందర్శించారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అక్కడి నుండి హిందూపురం చేరుకొని, 50 లక్షలతో నిర్మించనున్నఅంబేద్కర్ భవనానికి శంకుస్థపన చేశారు. హిందూపురం ఆర్టీసి డిపో పరిధఇలో బాలకృష్ణ 12 కొత్త బస్సుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు బస్సు నడిపారు.












Click it and Unblock the Notifications