ముంబైకి సాహూ: గుడుల్లో రూ.80 కోట్ల సొత్తు చోరీ

విజయవాడ: గజదొంగ ప్రకాష్ సాహూ ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ వచ్చాడు. అతను దాదాపు 47 ఆలయాల్లో 80 కోట్ల పైచిలుకు విలువ చేసే సొత్తును చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రకాష్‌ సాహూను పోలీసులు ముంబై తరలించారు. ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో దోపిడీ చేసిన వెండిని ముంబైలో విక్రయించాడనే సమాచారంతో సాహూను ముంబై తీసుకెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన సాహూను బుధవారంనాడు విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Theif Prakash Sahu shifted to Mumbai

1998లో విజయవాడ కనకదుర్గ ఆలయంలోని బంగారు కిరీటాన్ని కూడా సాహూనే దొంగలించాడు. అప్పట్లో అరెస్ట్‌ అయిన సాహూ అనంతరం బెయిల్‌పై విడుదలై తిరిగి దొంగతనాలు కొనసాగించాడు. ఈ ఏడాది మార్చిలో విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో 40 కిలోల వెండి ఇతర ఆభ రణాలను సాహూ దొంగలించాడు.

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దోపిడీ చేసింది సాహూనే అని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి నిఘా ఉంచిన పోలీసులు విజయవాడ సమీపంలో సాహూను అరెస్ట్‌ చేశారు. ఇతర దక్షిణాది రాష్ర్టాల్లో చేసిన దొంగతనాల చిట్టాను కూడా సాహూ విచారణలో పోలీసులకు వివరించారు.

47 ఆలయాల్లో రూ.80 కోట్ల విలువైన సొత్తును చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం దోపిడీ సొమ్మును రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+