పట్టపగలు దొంగల బీభత్సం: ముగ్గురి గొంత కోశారు, ఒకరి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు వద్ద గల ఓ ఇంట్లోకి దుండగులు ప్రవేశించి దోపిడీకి ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న ముగ్గురిపై దుండగులు దాడి చేసి వారి గొంతులు కోశారు.

శనివారం జరిగిన ఈ సంఘటనలో ఒకర మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆడిటర్ నాగేశ్వర రావు ఇంట్లోకి దోపిడీ దొంగలు ప్రవేశించి భారీగా నగలను, నగదును దోచుకున్నారు. కుటుంబ సభ్యులపై దాడికి తెగబబడ్డారు. దొంగల దాడిలో నాగేశ్వర రావు కుమారుడు, కూతురు, భార్యలపై వారు దాడి చేశారు.

Theives attacks in Nellore, one dead

దోపిడీ దొంగల దాడిలో ఒక్కరు మరణించారని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. వారి పేర్లను వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. దొంగల దాడితో ఇంట్లోనివారి పెద్దగా కేకలు వేశారని, దాంతో ఇరుగు పొరుగు వారు వచ్చారని చెబుతున్నారు.

స్థానికులు ముగ్గురు దొంగల్లో ఒకతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పారిపోయారు. నాలుగు రోజుల పాటు దోపిడీ దొంగలు ఆ ఇంటి విషయంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Theives trespassed into a house attacked on family members and killed one person at Nellore in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X