టీడీపీకి కలిసొచ్చిన పులిచింతల- నాడు వైఎస్, నేడు జగన్ టార్గెట్-పాత రాజకీయానికి పదును
ఏపీలో కృష్ణానదీ వరద ప్రవాహానికి పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిన ఘటన కలకలం రేపుతోంది. ఆధునిక కాలంలో ఓ ప్రాజెక్టు గేటు ఊడిపోవడాన్ని కనివినీ ఎరుగని ఘటనగా నిపుణులు అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు సైతం దీనిపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వీరి సంగతి ఎలా ఉన్నా విపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం తమ పాత రాజకీయానికి పదును పెడుతోంది. గతంలో మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం పథకంలో భాగంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు నాణ్యతపై అప్పట్లోనే సందేహాలు వ్యక్తం చేసిన టీడీపీ.. ఇప్పుడు గేటు ఊడిపోయిన ఘటనను రాజకీయంగా పూర్తిగా వినియోగించుకునేందుకు పావులు కదుపుతోంది.

పులిచింతల గేటుపై రాజకీయం
గుంటూరు జిల్లాలోని పులిచింతల గేటు ఊడిన వ్యవహారంపై ఇప్పుడు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరద ప్రవాహానికి ఊడిపోయే స్ధితిలో పులిచింతల గేట్లు ఉన్నాయన్న విషయం ఇప్పుడు నిపుణులతో పాటు సామాన్య ప్రజలనూ కలవర పెడుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య పరస్పరం విమర్శల దాడి సాగుతోంది. ఈ దుస్ధితికి కారకులెవరన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా తమకు నష్టం జరగకుండా చూసుకునేందుకు వైసీపీ, టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం మాజీ సీఎం, ప్రస్తుత సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ హయాంలో ప్రారంభం కావడం, ఇప్పుడు జగన్ హయాంలో గేటు ఊడిపోవడంతో వైసీపీకి ఇదో ఇబ్బందిరకరమైన పరిణామంగా మారుతోంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు టీడీపీ వెంటనే రంగంలోకి దిగిపోయింది.

డిఫెన్స్ లో వైసీపీ
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తొలిసారిగా పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్ధాయిలో నీటిని నిల్వ చేశారు. అంటే అన్నీ సవ్యంగా ఉన్నట్లు చూసుకున్నాకే పులిచింతలలో నీటిని నిల్వ చేశారన్న మాట. కానీ ఇప్పుడు గేటు ఊడిపోవడంతో అప్పటి టీడీపీ సర్కార్ .. నాణ్యతను పట్టించుకోకుండానే ప్రాజెక్టును ప్రారంభించిందన్న ప్రశ్నల్ని వైసీపీ ఎక్కుపెడుతోంది. చంద్రబాబు హయాంలోనే అవినీతి వల్లే ఈ ప్రాజెక్టు నాణ్యత లేకుండా పోయిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాణ్యత పరిశీలన చేసి ప్రాజెక్టు మొదలుపెట్టి ఉంటే ఇవాళ ఈ దుస్ధితి వచ్చేది కాదంటున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ఈ వాదన హేతుబద్ధంగా లేకపోవడంతో అధికార పక్షం డిఫెన్స్ లో పడుతోంది. అంతగా అనుభవం లేని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షానికి కౌంటర్ ఇచ్చేందుకు అస్త్రాలు వెతుక్కోవాల్సిన పరిస్దితి. దీంతో జల వనరులశాఖ అధికారులపైనే ఆయన ఎక్కువగా ఆధారపడుతున్నారు.

పాత రాజకీయానికి టీడీపీ పదును
గతంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన దగ్గరి నుంచీ పులిచింతల ప్రాజెక్టు నాణ్యతపై విమర్శలు చేస్తున్న టీడీపీ.. ఇప్పుడు గేటు ఊడిన ఘటనతో మరోసారి అదే రాజకీయాన్ని తెరపైకి తెస్తోంది. పులిచింతల ప్రాజెక్టును కమిషన్లకు కక్కుర్తి పడి నిర్మించారని గతంలో ఆరోపించిన టీడీపీ.. ఇఫ్పుడు గేటు ఘటనను తమ వాదనకు మద్దతుగా వాడుకుంటోంది. వైసీపీ సర్కార్ నాణ్యతను పరిశీలించకుండానే భారీ ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో తమ విమర్శలపై ఎదురుదాడి చేశారని, ఇప్పుడేం చెప్తారని ప్రశ్నిస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు భద్రతపైనా సందేహాలు వ్యక్తం చేస్తోంది. దీంతో అధికారంలో ఉన్న వైసీపీ ఇరుకునపడుతోంది.

నాడు వైఎస్, నేడు జగన్
గతంలో జలయజ్ఞంలో భాగంగా నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ మానసపుత్రికగా తెరపైకి వచ్చిన పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకూ కృష్ణా, గుంటూరు జిల్లాలు భారీగా లబ్ది పొందాయి. వైఎస్ హయాంలో ప్రాజెక్టు తెరపైకి రాగానే విపక్షంలో ఉన్న టీడీపీ విమర్శలు మొదలుపెట్టేసింది. ముఖ్యంగా నాణ్యతపై ప్రశ్నలు సంధించేది. ఈ ప్రాజెక్టు తెరపైకి రాగానే, ఈపీసీ విధానంలో పనులు అప్పగించగానే కమిషన్ల పేరుతో విమర్శలు ప్రారంభించిన టీడీపీ.. చాలా కాలం పాటు వాటిని కొనసాగించింది. ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేసి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు గేటు ఊడే పరిస్ధితి రావడంతో నాణ్యత మీద తాము గతంలో వైఎస్ హయాంలో వ్యక్తం చేసిన అనుమానాలే నిజమయ్యాయని టీడీపీ చెబుతోంది. గతంలో తమ వాదనకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో వైసీపీకి కూడా ఈ వాదనను కౌంటర్ చేయడం కష్టంగా మారింది.

టీడీపీకి పులి"చింత"ల మైలేజ్
ఏపీలో విపక్ష టీడీపీకి పులిచింతల రాజకీయంగా ఎప్పటికప్పుడు వరంగా మారుతోంది. గతంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో పులిచింతలపై మొదలుపెట్టిన విమర్శలు ఇప్పటికీ కొనసాగించేందుకు టీడీపీకి మరో అవకాశం దొరికింది. గతంలో పులిచింతలపై అసెంబ్లీలో విమర్శలతో వైఎస్ ను ఇరుకునపెట్టినా ఆయన చాణక్యంతో వాటిని తిప్పికొట్టగలిగారు. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ గేటు ఊడే పరిస్దితి రావడంతో ఇప్పుడు జగన్ టీడీపీకి లక్ష్యంగా మారిపోతున్నారు. నిన్నటి కేబినెట్ భేటీలోనూ వైఎస్ జగన్ మంత్రుల్ని పులిచింతలపై విమర్శలకు కౌంటర్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తద్వారా ప్రభుత్వం ఇరుకునపడుతుందన్న విషయాన్ని జగన్ స్వయంగా అంగీకరించినట్లయింది. తాజా పరిణామాల్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ నేతలు.. అప్పట్లో తాము చేసిన విమర్శల్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. గతంలో మీడియా కథనాలను సైతం తెరపైకి తెస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ వద్ద బలమైన అస్త్రాలేవీ లేకపోవడంతో రాజకీయంగా విపక్షం మరోసారి పైచేయి సాధిస్తోంది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications