పెద్దిరెడ్డికి ఎన్ని ఓట్లు ?, ఎంత మెజారిటీ ?, చంద్రబాబు, జగన్ హవా కూడా ఇంతలేదురా సామి
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ పూర్తి అయిన తరువాత పలు నియోజక వర్గాల్లో ఇంకా ఎన్నికల వేడి ఏమాత్రం తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పోటీ చేసిన పులివెందుల, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజక వర్గాల్లో ఎన్నికల వేడి తగ్గినా కొన్ని నియోజక వర్గాల్లో మాత్రం ఎన్నికల వేడి ఇంకా ఎక్కువగానే ఉంది.
ఇలాంటి నియోజక వర్గాల్లో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజక వర్గం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరులో పోటీ చెయ్యడం మొదటి నుంచి వార్తలో నిలిచింది. పుంగనూరు నుంచి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలుపు విషయం ఎటు ఉన్నా ఆయన మెజారిటీ మీద ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. పెద్దిరెడ్డి హవా అలా ఉంది.

పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పోటీ చెయ్యడంతో అదే నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రా రెడ్డి అలియాస్ చల్లా బాబు, సొంత పార్టీ అభ్యర్థిగా బోడే రామచంద్ర యాదవ్ పోటీలో నిలిచారు. ఇక బీఎస్పీతో పాటు పలు పార్టీల సింబల్ మీద పుంగనూరు నుంచి కొంత మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
గతంలో పుంగనూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి అయినా పెద్దిరెడ్డికి గతంలో ఎంత మెజారిటీ వచ్చింది ?, ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది ? అంటూ ఇప్పుడు పుంగనూరులోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జోరుగా బెట్టింగులు జరగుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి ఒక్క పుంగనూరుకే పరిమితం కాకుండా పలు జిల్లాల్లో వైసీపీ అంతా తానై కథ నడిపిస్తున్నారు. పెద్దిరెడ్డి మీద నమ్మకంతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కూడా ఆయనకు పలు నియోజక వర్గాల బాధ్యతను అప్పగించారు. అదే హవాతో పెద్దిరెడ్డి మీద జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications