'జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, నేర చరిత్ర బయటపడుతోంది'
నెల్లూరు/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు.
జగన్‌లాంటి నేరస్తుడు అధికారంలోకి రాడని జోస్యం చెప్పారు. పదమూడు కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ నేర చరిత్ర చిన్నచిన్నగా బయటపడుతోందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉపయోగించే భాష, వారి పద్ధతి సక్రమంగా లేదన్నారు. వారి తీరు మార్చుకోవాలని సూచించారు.

వరద నష్టం రూ.3,760 కోట్లు: చంద్రబాబు
భారీ వర్షాలు, వరదల వల్ల ఏపీలో రూ.3,760 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందాలకు వివరించారు. రాష్ట్రంలో వరదలు, కరవు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు పర్యటించాయి.
అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మాట్లాడారు. అల్ప పీడనం వల్ల నాలుగు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. కరవు, వరద నష్టాలను అంచనా వేసి రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications