జీవితంలో సంతోషమే లేదు: చంద్రబాబు ప్రభుత్వం సర్వేలో ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో పాలనను మరింత పారదర్శకం చేయాలన్న ఆలోచనతో పలు అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేయించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా జీవితంలో సంతృప్తి లేదని ఎక్కువమంది చెప్పారు.

మొదటిస్థానంలో శ్రీకాకుళం

మొదటిస్థానంలో శ్రీకాకుళం

ఆరు అంశాలపై ఈ సర్వేను అన్ని జిల్లాల్లో నిర్వహించారు. ప్రతి ప్రశ్నకు 0 నుంచి 10 పాయింట్లు కేటాయించారు. సంతోషం విషయంలో ప్రకాశం జిల్లా అట్టడుగు స్థానంలో ఉంది. శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉంది.

ప్రకాశంలో చాలా తక్కువ

ప్రకాశంలో చాలా తక్కువ

పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ప్రకాశంలో సంతోష స్థాయి కేవలం 4.697 పాయింట్లు మాత్రమే ఉంది. అత్యధికంగా ఉన్న శ్రీకాకుళం 6.41 పాయింట్లతో ఉంది.

వీటిని ప్రామాణికాలుగా..

వీటిని ప్రామాణికాలుగా..

ప్రధానంగా మొత్తం స్థూల వస్తుత్పత్తి(స్థూల ఆదాయం), ఆరోగ్యంగా ఉన్న కాలం ఆధారంగా కలిపి జీవిత కాలపు అంచనా, సామాజిక మద్దతు, తన ఇష్టప్రకారం జీవించే హక్కు, ఔదార్యం, ప్రభుత్వ, ప్రయివేటు వ్యాపారాలలో అవినీతిపై అవగాహన తదితర అంశాలను ప్రామాణికలుగా తీసుకున్నారు.

మొత్తం 17,800 మందిని ప్రశ్నించారు. మొత్తం 16,159 మంది అభిప్రాయాలను క్రోడీకరించి నివేదికను రూపొందించారు.

సంతోష సూచికలు..

సంతోష సూచికలు..

రాష్ట్రంలో స్త్రీ-పురుష నిష్పత్తి అనుగుణంగానే సర్వేలో కూడా స్త్రీ-పురుష అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. అలా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో సంతోష సూచికలు పది పాయింట్లకు సరాసరిగా 5.368గా ఉన్నట్లు తేలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many Andhra Pradesh people said that there is no happy in life.
Please Wait while comments are loading...