• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్టీ ఉంటుందా.. ఉండకపోవచ్చు.. వీలీనం చేస్తారేమో..? జనసేనపై రూమర్లు..! పవన్ నోరు విప్పుతారా..?

|

అమరావతి/హైదరాబాద్ : జనసేన పార్టీ పైన పుకార్లు తారా స్థాయిలో షికార్లు చేస్తున్నాయి. జనసేన పార్టీ ఇక ఉండదు., ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారు, పార్టీ పగ్గాలను వేరే వారికి ఇచ్చి పార్టీ అధినేతగా పవన్ తప్పుకుంటారు.., గతంలో ప్రజారాజ్యం మాదిరిగానే జనసేన అడుగులు పడుతున్నాయి, ఇది అమరావతిలో జనసేన పార్టీ గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ప్రజలతో పాటు, జనసేన కార్యకర్తల్లో నెలకొన్న అయోమయ పరిస్థితులకు పార్టీ అద్యక్షుడిగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. పవన్ ఇకనైనా స్పందించి విమర్శకుల నోళ్లకు తాళం వేసి జన సైనికుల్లో స్థైర్యం నింపాలని పార్టీ శ్రేణులు కోరుతున్నట్టు తెలుస్తోంది.

  ప్రజల ఆకలి కష్టాలు పట్టించుకోండి- పవన్
  జనసేనపై రకరకాల పుకార్లు..! సేనాని స్పష్టత ఇవ్వాలంటున్న సైనికులు..!!

  జనసేనపై రకరకాల పుకార్లు..! సేనాని స్పష్టత ఇవ్వాలంటున్న సైనికులు..!!

  ప్రశ్నిస్తానంటూ జనంలోకి వచ్చారు హీరో పవన్ కళ్యాణ్. మెగా అభిమానుల అండదండలతో మంచి పాపులారిటీ సంపాదించారు. వ్యక్తి గతంగా కూడా పవన్ మానవత్వం ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్ ఫొలోయింగ్ ఉన్న గబ్బర్ సింగ్ అభిమానుల్లో కేవలం సినిమా వరకే పరిమితమైన వారు లక్షలాది మంది ఉన్నారు.గత ఎన్నికల్లో సగం ఓటమికి అదే కారణం. మరో కీలక కారణం.. టీడీపీ. పవన్ తమను విమర్శించటం వదిలేసి.. వైసీపీపై దుమ్మెత్తిపోయటాన్ని టీడీపీ అనువుగా మలచుకుందామనుకుంది. కానీ.. అదే రివర్స్ స్వింగ్ లో పవన్, చంద్రబాబులకు తగిలి పార్టీ ఓటమికి కారణమైంది. పవన్ పార్టీకు అనుకూలంగా పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వైసీపీ ఖాతాలోకి చేరింది. అంతటి భారీ మెజార్టీ రావటానికి పవన్ గెలిచినా మళ్లీ చంద్రబాబు వైపు వెళతాడనే భయమే దీనికి కారణమనేది బహిరంగ రహస్యం.

  పవన్ సమాధానం చెప్పాలి..! ఇతర పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..!!

  పవన్ సమాధానం చెప్పాలి..! ఇతర పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..!!

  ఇదంతా గతం..పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ, టీడీపీ మాటల యుద్ధంతో సమయాన్ని వృధా చేసారు. ప్రజాసమస్యలు.. వైసీపీ హామీల ఊసే లేదు. జగన్ తానేదో దైవాంశసంభూతుడనే భావనలో ప్రసంగించాడు. తమ నేత ఏది చెబితే అదే భగవద్గీత అంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు చెక్క భజన చేయటానికే పరిమితమయ్యారు. ఇటువంటి కీలకమైన సమయంలో గొంతెత్తి.. నిలదీయాల్సిన పవన్ ఎంలాంటి స్పందన లేకుండా ఉండి పోయారు. ఏమైనా అంటే.. నేను లేస్తే మనిషిని కాదనేంతగా టైమిస్తున్నా.. లోపుగా సర్దుకోవాలి. లేకపోతే మీ అంతు చూస్తానంటూ ప్రకటనలకే పరిమితమయ్యారు. అంతేతప్ప ఇప్పటి వరకూ వైసీపీ పాలనపై తన దైన రీతిలో స్పందించ లేదు పవన్ కళ్యాణ్.

  జనసేన పైన షికార్లు చేస్తున్న పుకార్లు..! గబ్బర్ సింగ్ ఎక్కడ అంటున్న కార్యకర్తలు..!!

  జనసేన పైన షికార్లు చేస్తున్న పుకార్లు..! గబ్బర్ సింగ్ ఎక్కడ అంటున్న కార్యకర్తలు..!!

  తనను నమ్ముకున్న కాపుల రిజర్వేషన్ అంశం ఇటీవల తెరమీదకు వచ్చిం.ది. కేవలం కాపు అనే కారణంతో చంద్రబాబు, జగన్ ఇద్దరూ పవన్ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. అటువంటి వర్గానికి బీసీలా, లేకపోతే ఓబీసీలా అనే సందిగ్ధంలో పడినపుడుకూడా కాటమరాయుడు కనికరించలేదు. రాష్ట్రంలో పాలన అయోమయంలో పడినా మాటలేదు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని గతంలో పవన్ బహిరంగంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టే వ్యవహరిస్తున్నారు తప్ప మరో ఆలోచన గబ్బర్ సింగ్ కు లేదనే చర్చ కూడా జరుగుతోంది.

  ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు..! సంధించేందుకు సమయం ఉందటున్న కాటమరాయుడు..!!

  ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు..! సంధించేందుకు సమయం ఉందటున్న కాటమరాయుడు..!!

  ఐతే మరో 100 రోజుల తరువాత తానేమిటో చూపుతానంటూ సర్దార్ గబ్బర్ సింగ్ స్పందన కూడా అభిమానుల్లో చికాకు పుట్టిస్తుంది. కనీసం ఇప్పటికైనా మేల్కొని.. జనాదరణ ఉన్న జేడీ వంటి నేతలను పార్టీ మారకుండా చూడాలంటున్నారు. ఇప్పుడు మీడియాలో పవన్ కూడా జెండా పీకేస్తాడనే ప్రచారం ఊపందుకుంది. మరికొందరైతే బీజేపీలో పార్టీను విలీనం చేస్తాడంటున్నారు. దీనికి బలాన్ని చేకూర్చేలా రెండు జాతీయ పార్టీలు తనను కలిశాయంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఇంతటి గడ్డుకాలంలో తాను ఎలా వ్యవహరిస్తారు.. ఎటువంటి వ్యూహంతో ప్రత్యర్థుల విమర్శలకు, పార్టీ పై వస్తున్న పుకార్లకు సమాధానమివ్వాలనే డిమాండ్ తారా స్థాయిలో వినిపిస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rumors on the Janasena Party are making in high level. The Janasena party will no longer exist. They will merge into another party, Pawan will take over the party reins. Along with the people, Pawan Kalyan is demanding that the party's leader be answerable for the dilemma among the Janasena activists.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more