జగన్ నిర్లక్షం కారణంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం తాండవం చేయడానికి గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. డయేరియా వ్యాప్తి చెందడంతో ఇప్పటివరకు ఏడు మంది చనిపోయారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని, గత ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం తాగునీటి వ్యవస్థని ఏమాత్రం పట్టించుకోలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు
ప్రస్తుతం ఆసుపత్రిలో 41 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, అందువలనే అతిసారం వ్యాప్తి చెందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జలజీవన్ పథకం నిధులను గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి మళ్లించిందని, పారిశుద్ధ్యం, తాగునీటి వ్యవస్థను ఏమాత్రం పట్టించుకోలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.

జగన్ ప్రభుత్వం నిర్లక్షం వలనే భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు గుర్లలో క్లోరినేషన్ పనులు చేపట్టాలని, ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. త్వరలోనే గుర్లలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, స్థానిక ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
విజయనగరం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదని, తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన జలజీవన్ పథకం నిధులను వైసీపీ నాయకులు పూర్తిగా దుర్వినియోగం చేశారని, కొంతమంది నాయకులు ఆ నిధులు మింగేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
గుర్లలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తున్నారని ప్రాణ నష్టం జరగకుండా మా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. కొన్ని రోజుల పాటు కలుషిత నీరు ముట్టుకోకుండా ఉండాలని, ప్రభుత్వం సరఫరా చేస్తున్న ట్యాంకర్ల నీరు ఉపయోగించుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ప్రజలకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications