నీటిలో ఇవి కలుపుకొని తాగండి.. ఆరోగ్యమంతా మీదే!
మన శరీరంలో దాదాపు 60 శాతం భాగం నీటితో నిర్మితమై ఉంటుంది. దీనివల్ల శరీరానికి నీరు ఎంతో ముఖ్యం. అనేక వ్యాధుల నుంచి రక్షించడానికి నీరు ఎంతో తోడ్పడుతుంది. వేసవికాలం వచ్చేసింది. ఎండలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ పుష్కలంగా నీరు తాగాలి.
నీరు ఎక్కువగా తాగకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. అంతేకాదు.. ఒకదాని వెంబడి మరొకటిగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండాలంటే నీటిలో కొన్నిపదార్థాలను కలుపుకొని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కీర దోసకాయ - పుదీనా: కీరదోసకాయ, పుదీనాను నీళ్లలో కలుపుకుని తాగాలి. ఓ సీసాలో నీళ్లు నింపి అందులో కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు వేసి వదిలేయాలి. ఇలా ప్రతిరోజూ ఈ నీటిని తీసుకోవడం ద్వారా మీ శరీరం డీ హైడ్రేట్ అవకుండా ఉంటుంది. శరీరంలో నీటి కొరత కూడా తొలగిపోతుంది.
నిమ్మకాయ: వేసవిలో నిమ్మకాయను ఉపయోగించడం చాలా మేలు. ఉప్పుకు బదులు నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నిమ్మరసాన్ని నీటిలో కలుపుకుని తాగడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సోంపు గింజలు: ఒక స్పూను సోంపు గింజలను ఒక మగ్ లో నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత అవి చల్లారిన తర్వాత తాగాలి. వడదెబ్బ నుంచి, కడుపులో గ్యాస్ ఏర్పడే సమస్య నుంచి కాపాడుతుంది.
చియా సీడ్స్: చియా గింజలను నీటిలో కలిపి తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది. ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో హైడ్రేషన్ సమస్య ఏర్పడదు.












Click it and Unblock the Notifications