చంద్రబాబు క్యాబినెట్ లో ఈ ముగ్గురూ వెరీ స్పెషల్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏపీ సీఎంగా చంద్రబాబుతో పాటు మొత్తం 24మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక వీరిలో 17మంది తొలిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు అవకాశం దక్కింది. అయితే ఈ ముగ్గురు తెలుగు దేశం పార్టీకి చెందిన వారే కావడం ఒక విశేషం కాగా, ఈ ముగ్గురు కూడా తొలిసారి మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం వెరీ స్పెషల్.

మంత్రి వర్గంలో వంగలపూడి అనితకు స్థానం
ఇక మహిళా మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారి వివరాల్లోకి వెళితే మాజీ ఎమ్మెల్యే, టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత 2014 ఎన్నికలలో పాయకరావుపేట నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత 2018లో టిటిడి బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2019 ఎన్నికలలో కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసిపి నేత తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు.

These three are very special in Chandrababu cabinet

ఎస్సీ సామాజిక వర్గం నుండి అనితకు అవకాశం
ఆపై 2021లో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమితురాలై గత ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటమే చేశారు .ఇక ప్రస్తుతం మళ్ళీ పాయకరావుపేట ఎమ్మెల్యేగా కంబాల జోగులు పై 43,727 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నేడు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు సామాజిక సమీకరణాలలో భాగంగా మంత్రివర్గంలో స్థానం దక్కింది.

గుమ్మడి సంద్యారాణికి ఎస్టీ సామాజికవర్గం నుండి అవకాశం
మరో మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1999 లో కాంగ్రెస్ పార్టీ నుండి సాలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం నుండి పీడిక రాజన్న దొర చేతిలో ఓడిపోయారు. ఆపై 2015లో శాసనమండలి సభ్యురాలుగా ఎన్నికై 2021 వరకు పనిచేశారు.

గిరిజన సామాజిక వర్గం నుండి మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి
2020 నుండి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పని చేస్తున్న ఆమె ప్రస్తుత ఎన్నికలలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరను ఓడించి మంత్రి స్థానాన్ని దక్కించుకున్నారు. సామాజిక సమీకరణాలలో సామాజిక సమీకరణాలలో గిరిజన సామాజిక వర్గం నుండి ఆమెకి మంత్రి పదవి దక్కింది.

ఎస్ సవిత బీసీ సామాజిక వర్గం నుండి మంత్రిగా
ఇక కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎస్ సవిత పెనుగొండ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మీద తొలిసారి విజయం సాధించారు. బీసీ సామాజిక సమీకరణలో భాగంగా ఎస్ సవితకు మంత్రివర్గంలో స్థానం దక్కింది.చంద్రబాబు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే వీరికి అవకాశం కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+