Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రశాంత్ కిశోర్ కు పోటీగా తెలుగు స్ట్రాటజిస్టులు - పంజాబ్ లో అభ్యర్ధుల గెలుపు వెనుక : నయా సంచలనం..!!

తెలుగు ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. రాష్ట్ర రాజకీయ నేతలే జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఇక, ఎన్నికల వ్యూహకర్తల ఎంట్రీ సైతం 2014 నుంచి దేశ వ్యాప్తం గా మొదలైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ఛరిష్మాతో పాటుగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కలిసి వచ్చి.. భారీ మెజార్టీతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ వరుసగా అనేక రాష్ట్రాల్లో తన రాజకీయ వ్యూహాలతో పలు పార్టీలను అధికారంలోకి తెచ్చారు. అందులో 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటంలోనూ సహకారం అందించారు. అయితే, ఇప్పుడు ఏపీలోనూ పలు యువ పొలిటికల్ స్ట్రాటజిస్టులు తమ సత్తా చాటుతున్నారు.

1ఆప్ వేవ్ ను తట్టుకుంటూ క్షేత్ర స్థాయిలో

1ఆప్ వేవ్ ను తట్టుకుంటూ క్షేత్ర స్థాయిలో

పంజాబ్ లో తాజాగా జరిగిన ఎన్నికల్లో తమ రాజకీయ వ్యూహాలతో పలువురు అభ్యర్ధుల విజయం వెనుక కీలక పాత్ర పోషించారు. తెలుగు విద్యార్దులు ఫార్ట్యూన్ వాక్ పేరుతో ఒక సర్వే సంస్థను ఏర్పాటు చేసారు. అందులో నాయిని అనురాగ్ రెడ్డి.. కృష్ణా రెడ్డి.. ముఖేష్ చౌదరి కలిసి పంజాబ్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు అందించారు. వీరిలో అనురాగ్ తో పాటుగా ముఖేష్ ఎండీలుగా ఉండగా.. కృష్ణా రెడ్డి చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ ప్రభంజనం కనిపించింది. కానీ, ఆ వేవ్ లోనూ శిరోమణీ అకాళీదల్ కూటమి అభ్యర్ధుల తరపున వీరు పని చేసారు. శిరోమణి అకాలీ దల్..బీఎస్పీతో కలిసి పొత్తుతో పని చేసాయి. వీరు పని చేసిన మూడు స్థానాల్లో బీఎస్పీ ఒక చోట.. శిరోమణి అకాలీదళ్ రెండు నియోజకవర్గాల్లో గెలుపొందారు.

 పోలింగ్ బూత్ యూనిట్ గా పక్కా లెక్కలతో

పోలింగ్ బూత్ యూనిట్ గా పక్కా లెక్కలతో

ఈ ముగ్గురు యువకులు కొంత మంది సిబ్బందితో కలిసి ఈ మూడు నియోజకవర్గాల్లో పని చేసారు. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలు సమయం ఉండగానే.. 60 మంది సిబ్బందితో రెండు టీమ్స్ గా ఈ నియోజకవర్గాల్లో పని చేసారు. స్థానికంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అంశాల పైన ఫోకస్ పెట్టారు. ప్రజలను ఆకట్టుకొనే విధంగా.. పోటీలో ఉన్న అభ్యర్ధుల ద్వారా ప్రచారం చేయించారు. ఆప్ ఎత్తుగడలను గమనిస్తూ... స్థానిక సమీకరణాలు అంచనా వేస్తూ..నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకొనే విధంగా అభ్యర్ధులకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇక ప్రచార సమయంలోనూ ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయం సేకరిస్తూ..అవసరమైన మార్పులు సూచించారు.

ఎప్పటికప్పుడు అవసరమైన రీతిలో

ఎప్పటికప్పుడు అవసరమైన రీతిలో

కొన్ని ప్రాంతాల్లో ప్రజలను తమ వైపు తిప్పుకోవటంలో.. వెనుకబడ్డామనే విషయాన్ని గమనించి..అక్కడ వెంటనే అవసరమైన మార్పులు చేసారు. విద్యార్ధులు..మహిళలను ఆకట్టుకొనేలా ఆప్ మేనిఫెస్టోకు పంజాబ్ ప్రజలు ఆకర్షితులైన విషయం గ్రహించారు. దీంతో..ఈ మూడు స్థానాల్లో ప్రత్యేకంగా విద్యార్దులు..మహిళలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వారికి పెన్షన్ తో పాటుగా విదేశాల్లో విద్యకు సంబంధించిన అంశాల పైన ఫోకస్ పెట్టారు. పోలింగ్ బూత్ యూనిట్ గా తీసుకొని తమ మద్దతుదారుల ఓట్లు ఎటు మళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ.. ఆప్ బలంగా ఉందనే విషయం గ్రహించారు. దీంతో..అక్కడ కొత్త వ్యూహాలు అమలు చేసారు.

ఆ యువకులు నవ సంచలనంగా

ఆ యువకులు నవ సంచలనంగా

ఆప్ అభ్యర్ధులకు కాకుండా.. తమ అభ్యర్ధుల విజయానికి అసవరమైన విధంగా క్షేత్ర స్థాయిలో ప్రచారంలో మార్పులు చేసారు. ఇలా ఆప్ వేవ్ ను తట్టుకుంటూ.. తాము పని చేసిన అభ్యర్ధులను గెలిపించటం ద్వారా ఇప్పుడు ఈ తెలుగు యువకులు నయా సంచలనానికి కారణమయ్యారు. భవిష్యత్ లో తమ సంస్థ ద్వారా మరింతగా క్షేత్ర స్థాయిలో ఎన్నికల వ్యూహాల కోసం పని చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ యువకుల సమర్ధత అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+