చిరంజీవి పిఆర్పీలాగే: జగన్ పార్టీపై నారా లోకేష్ మళ్లీ

తాజాగా బుధవారం మరోసారి స్పందించారు. నాటి ప్రజారాజ్యం పార్టీకి, నేటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తేడా లేదని, కాంగ్రెసులో విలీనం లేదా పొత్తు విషయంలో మాత్రమే ఆ రెండు పార్టీల మధ్య తేడా ఉందని ట్వీట్ చేశారు. నోట్ల కోసం సీట్లు అమ్ముకోవడంలో ఆ రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు.
సిఎం రమేష్ పైన ఎర్రబెల్లి
తమ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌తో వివాదం సమసిపోలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా అన్నారు. తాను ప్రాణం ఉన్నంత వరకు టిడిపితోనే ఉంటానని చెప్పారు.
మరోవైపు మిగులు జలాలు కోరబోమంటూ వైయస్ ప్రభుత్వం ఇచ్చిన లేఖ రాష్ట్రానికి ఉరితాడులా మారిందని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు హైదరాబాదులో మండిపడ్డారు. అల్మట్ట ఎత్తు 19 అడుగులు పెంచితే కృష్ణా డెల్టా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని, నారు మళ్లకు జూన్‌లో రావాల్సిన నీరు నవంబరు వరకు రాదన్నారు.












Click it and Unblock the Notifications