లోకేష్: ఎన్టీఆర్ కుటుంబం నుండి మూడో తరానికి మంత్రిపదవి
అమరావతి: ఎన్టీఆర్ కుటుంబం నుండి మూడో తరానికి చెందిన వ్యక్తి మంత్రి పదవిలోకి ప్రవేశించారు.లోకేష్ మంత్రిగా ప్రమాణం చేయడంతో ఎన్ టి ఆర్ కుటుంబం నుండి మూడో తరం నుండి మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా నిలిచాడు.
1983లో సినీ నటుడు ఎన్టీఆర్ టిడిపిని స్థాపించాడు. అయితే పార్టీని స్థాపించడమే కాదు అనతి కాలంలోనే ఆయన స్థాపించిన పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఎన్టీఆర్ 1983లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర్ రావులు ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేశారు.

ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన దగ్గుబాటి,ఎన్టీఆర్ లది రెండో తరం.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వీరిద్దరూ కూడ మంత్రులుగా పనిచేశారు.1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే చంద్రబాబునాయుడు తన క్యాబినెట్ లో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను చేర్చుకొన్నారు. ఆయనకు రవాణా శాఖ పదవిని కట్టబెట్టారు.
హరికృష్ణ ఎక్కువకాలం పాటు మంత్రివర్గంలో లేరు.ఎన్టీఆర్ బతికున్న కాలంలో ఆయన తన కుటుంబసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. రాజకీయాలకు దూరంగా ఆయన తన కుటుంబ
సభ్యులను ఉంచారు.
ఎన్టీఆర్ కుమార్తై పురంధేశ్వరి 2004 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర మంత్రిగా కూడ పనిచేశారు. ఆమె దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు సతీమణి.ఆమె కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళపాటు పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లోకేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున అమరావతికి చేరుకొన్నారు.అయితే 2014 ఎన్నికల్లో సినీ నటుడు బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.












Click it and Unblock the Notifications