విషగుళికలు మింగిన విద్యార్థులు: మూడో విద్యార్థీ మృతి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లెలో విషగుళికలు తిన్న ముగ్గురు పదో తరగతి విద్యార్థుల్లో మూడో విద్యార్థి చంద్రమోహన్‌రెడ్డి కూడా మృతి చెందాడు. బెంగళూరు కొలంబియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది.
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాఠశాలకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు ముగ్గురు పదో తరగతి విద్యార్థులు విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

అనంతపురం జిల్లాలోని యాడికి మండలం వెంగన్నపల్లిలో బుధవారం ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన బెంగుళూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజారెడ్డి, నాగేశ్వర్ అనే విద్యార్థులు మరణించారు. శుక్రవారంనాడు మరో విద్యార్తి మరణించాడు.












Click it and Unblock the Notifications