అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారుల కడుపు మీద కొట్టి.. కోట్లకు పడగెత్తి: నారాయణ రెడ్డి ఆస్తుల లెక్క ఇదే?..

చైల్డ్ డెవలప్‌మెంట్ సంస్థలో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బయట వడ్డీ వ్యాపారం కూడా చేశాడు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ananthapur Employee Caught By ACB Raid నారాయణ రెడ్డి ఆస్తుల లెక్క ఇదే | Oneindia Telugu

అనంతపురం: ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) సంస్థలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. వేలకోట్లకు పడగెత్తిన వెంకట నారాయణ రెడ్డి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు.

ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం: కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తింపుఏసీబీకి చిక్కిన మరో తిమింగలం: కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తింపు

కరువుతో అల్లాడే జిల్లాలో.. చిన్నారుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బును వెంకట నారాయణ రెడ్డి తిమింగలంలా మింగేశాడు. ఒక స్వీపర్‌గా మొదలైన వెంకట నారాయణ రెడ్డి కెరీర్.. ఇప్పుడు కోట్లు కూడబెట్టేదాకా వెళ్లిందంటే.. అతని అవినీతి లీలలు ఎలా సాగుతూ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

స్వీపర్‌గా చేరి:

స్వీపర్‌గా చేరి:

అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని బత్తలపల్లికి చెందిన వెంకట నారాయణరెడ్డి.. 1985లో స్వీపర్‌గా ఐసీడీఎస్‌లో చేరాడు. కొన్నాళ్లకు ఆఫీస్‌ సబార్డినేట్‌(అటెండర్‌)గా ప్రమోషన్ పొంది.. ఆపై జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

చిన్న పిల్లల పౌష్టికాహారాన్ని మింగేసి:

చిన్న పిల్లల పౌష్టికాహారాన్ని మింగేసి:

పనిచేసేది చైల్డ్ డెవలప్‌మెంట్ సంస్థలో కావడంతో.. చిన్నారుల పౌష్టికాహారం నిమిత్తం నిత్యం చాలా రకాల ఆహార పదార్థాలు పంపిణీ చేయబడుతుంటాయి. అయితే వీటిని చిన్నారులకు చేరకుండా అడ్డుపడ్డ వెంకట నారాయణ రెడ్డి.. దారిమళ్లించి సొమ్ము చేసుకున్నాడు. ఏళ్లుగా అలా కూడబెట్టిన డబ్బుతో స్థిరాస్తులు వెనకేసుకున్నాడు.

రైతులకు అప్పులు:

రైతులకు అప్పులు:

చైల్డ్ డెవలప్‌మెంట్ సంస్థలో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బయట వడ్డీ వ్యాపారం కూడా చేశాడు. స్థానిక రైతులకు అప్పులిచ్చి వారి వ్యవసాయ భూములు, ఇళ్లు, ఇతరత్రా స్థిరాస్తులను తనఖా పెట్టుకున్నాడు.రాప్తాడు మండలానికి సంబంధించి ఓ రైతు భూమి, అనంతపురంలో మరో ఇల్లు, మరోచోట నివాస స్థలం తనఖాకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బంధువుల ఇళ్లలోను సోదాలు:

బంధువుల ఇళ్లలోను సోదాలు:

నారాయణరెడ్డి నివాసాలతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. వారి ఇళ్ల నుంచి భారీగా నగదు, నగలు, కారు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమాస్తుల గుర్తింపు తర్వాత.. అతన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. ఆపై కోర్టులో హాజరుపెట్టగా, న్యాయమూర్తి అతన్ని రిమాండ్‌కు ఆదేశించారు.

బినామీలు:

బినామీలు:

బినామీల పేర్లతో కాంట్రాక్టర్ అవతారమెత్తిన నారాయణ రెడ్డి.. పౌష్టికాహారం టెండర్లను దక్కించుకుని భారీ అవకతవకలకు పాల్పడ్డాడు. పిండి, వడియాలు వంటివే గాక గుడ్లు, ఇతరత్రా పౌష్టికహార పంపిణీల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. అంతేకాదు, చైల్డ్ డెవలప్‌మెంట్

సంస్థ పరిధిలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. కోర్టుల దాకా వెళ్లి పరిష్కరించే స్థాయికి ఎదిగాడు.

ఇదీ ఆస్తుల లెక్క:

ఇదీ ఆస్తుల లెక్క:

చైల్డ్ డెవలప్‌మెంట్ సంస్థలో అక్రమాల ద్వారా.. అనంతపురం శివారులోని బుక్కరాయసముద్రం, ఇటుకలపల్లి, కురుకుంట, కక్కలపల్లి, చిత్తూరు జిల్లా పాకాల ప్రాంతాల్లో ఐదు సెంట్ల నుంచి పది సెంట్ల వరకు భూమి సంపాదించాడు.

అలాగే అనంతపురం నగరంలో డూప్లెక్స్‌, ఏడు భవనాలు నారాయణరెడ్డి పేరు మీద ఉన్నాయి.బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, కూడేరు, బత్తలపల్లి ప్రాంతాల్లో 15ఎకరాలకుపైగా భూములు, రూ. 2.32 లక్షల నగదు, కిలో బంగారం, కిలోన్నర వెండిని ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం ఆస్తులు రూ.50కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

English summary
Sleuths of the Anti Corruption Bureau on Wednesday nabbed an employee of the Integrated Child Development Services (ICDS) department and seized assets estimated at over ₹50 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X