మోడీని తిట్టి ప్రజల్లోకి వెళ్లాలని బాబు, సీఎం పేషీలోను వైసీపీ ఎమ్మెల్యేలు: విష్ణు
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించి ప్రజలలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం అన్నారు.
ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడానికి కారణం అదే అన్నారు. పీఎంవోలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కనిపిస్తే దురుద్దేశ్యాలు ఆపాదించడం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి పేషీలోను వైసీపీ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారని విష్ణు కౌంటర్ ఇచ్చారు. పవన్ మాటల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయని చెప్పారు.
ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై ప్రభావం తప్పకుండా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాము ఒంటరిగా వెళ్లే అవకాశముందని చెప్పారు.












Click it and Unblock the Notifications