2024లో పవన్ కళ్యాణ్ కోరుకుంటున్న టర్నింగ్ పాయింట్ ఇదే!!
2023కు గుడ్ బై చెప్పి 2024కు స్వాగతం పలికాం. ఈ నూతన సంవత్సరం ప్రతీ ఒక్కరూ అనుకున్న పనులు జరగాలని, లక్ష్యాలు సాధించాలని, ఈ ఏడాది తమకు శుభాలను ఇవ్వాలని కోరుకుంటారు. అలాగే ఈ నూతన సంవత్సరం ఏపీ ప్రజలు బాగుండాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తూనే ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పార్టీల అధినేతల ఆకాంక్షలు ఆసక్తిగా ఉన్నాయి .
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన బలమైన కోరికను ప్రజలకు తెలియజేస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం నూతన సంవత్సరం వేళ ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధినేత కె.పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గత అనుభవాలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్రానికి ఒక మలుపుగా, ప్రగతికి నాంది పలకాలన్నారు.
ఈ ఏడాది మీ నిర్ణయమే టర్నింగ్ పాయింట్ కావాలన్నారు. ప్రజా నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. 2024వ సంవత్సరం అందరికీ కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెస్తుందని ఆశిస్తున్నానని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ నూతన సంవత్సరం వేళ తన పోస్ట్ ద్వారా తన మనసులోని కోరికను తెలియజేశారు.
ఈ ఏడాది ప్రజలు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో తీసుకునే నిర్ణయం ఒక టర్నింగ్ పాయింట్ కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక మలుపు తీసుకురావాలని ఆకాంక్షించారు. మీరు తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు జనసేనను ఆదరించాలని, జనసేన టిడిపిలకు అధికారాన్ని కట్టబెట్టాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు నూతన సంవత్సరం నాడు ప్రజలకు తన సందేశాన్ని తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications