వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్తగా 14 మంది ఎమ్మెల్సీలు - వైసీపీ లిస్టు ఇదే : ఈ వారంలోనే నోటిఫికేషన్ కు ఛాన్స్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ శాసన మండలిలో 14 ఖాళీల భర్తీ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుసగా అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..ఎంపీల స్థానాల ఎన్నికల పైన ఫోకస్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఏపీలోని ఎమ్మెల్సీ సీట్ల భర్తీ పైన నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో మూడు సీట్లు ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. మిగిలిన 11 సీట్లు స్థానిక సంస్థల కోటాలో పూర్తి చేయాలి. కొవిడ్‌ కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదావేసింది.

అసెంబ్లీతో పాటుగా కౌన్సిల్ లోనూ పూర్తి మెజార్టీ

అసెంబ్లీతో పాటుగా కౌన్సిల్ లోనూ పూర్తి మెజార్టీ

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోర్టు పరిధిలో ఉన్నందున స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గటం.. బద్వేలు ఉప ఎన్నిక సైతం జరుగుతుండటంతో ఇక, పెద్దల సభలోని ఖాళీల భర్తీకి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఎమ్మెల్యేల బలం..అన్ని జిల్లాల్లోనూ స్థానిక సంస్థల్లో వైసీపీ గెలుచుకోవటంతో ఈ 14 స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి 18 మంది సభ్యులు ఉన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్ధులు దాదాపు ఖరారు

ఎమ్మెల్సీ అభ్యర్ధులు దాదాపు ఖరారు

ఇక, ఈ 14 మంది వైసీపీ ఖాతాలో చేరితో ఆ పార్టీ బలం 32కు పెరగనుంది. మొత్తం 58 మంది సభ్యులు ఉన్న ఏపీ శాసన మండలిలో 32 స్థానాల తో వైసీపీ అటు శాసన సభలో..శాసన మండలిలో పూర్తి మెజార్టీతో నిలుస్తుంది. ఇప్పటికే మండలి ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఈ ఎన్నికల తరువాత ఈ రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెలలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఈ స్థానాల భర్తీ పైన ఒక అంచనాతో ఉన్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటా నుంచి ఎవరంటే

ఎమ్మెల్యే కోటా నుంచి ఎవరంటే

ఎమ్మెల్యే కోటాలో గత మేలో పదవీకాలం పూర్తిచేసుకున్న బద్వేలు వైకాపా బాధ్యుడు డీసీ గోవిందరెడ్డిని మళ్లీ కొనసాగించే అవకాశముంది. మిగిలిన రెండు స్థానాలనూ ఎస్సీ, మహిళకు ఇస్తారని తెలుస్తోంది. ప్రాంతీయ - సామాజిక సమీకరణాలను పదవుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ పక్కాగా పాటిస్తున్నారు. ఈ లెక్కలతోనే ఈ 14 స్థానాలు భర్తీ కానున్నాయి. ఇక, స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన 11 స్థానాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నంలలో రెండేసి, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, ప్రకాశంలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. వీటి కోసం ఆ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది.

ఉమ్మారెడ్డి..మర్రి రాజశేఖర్ పేర్లు ప్రముఖంగా

ఉమ్మారెడ్డి..మర్రి రాజశేఖర్ పేర్లు ప్రముఖంగా

కానీ, ప్రముఖంగా..వైసీపీ లిస్టులో ఉన్నాయంటూ... గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఉమ్మారెడ్డి తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, ఎమ్మెల్సీగానే పంపే ఛాన్స్ కనిపిస్తోంది. కృష్ణా జిల్లా నుంచి గన్నవరం నియోజకర్గ నేతలకే దక్కే అవకాశం ఉంది.

యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులలో ఒకరికి ఖాయంగా తెలుస్తోంది. రెండో స్థానం బీసీలకు దక్కనుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిన..తోట నరసింహం సతీమణి తోట వాణి పేరు ఖరారు అవుతుందని చెబుతున్నారు.
అదే విధంగా అనంత ఉదయ భాస్కర్ తో పాటుగా ఆకుల వీర్రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Recommended Video

Andhra Pradesh లో Load Relief కి వేళాయరా.. కోతల వేళలు | Electricity Crisis || Oneindia Telugu
ఏ జిల్లా నుంచి రేసులో ముందున్న వారు..

ఏ జిల్లా నుంచి రేసులో ముందున్న వారు..

అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే...ఉరవకొండ పార్టీ ఇన్ ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డికి ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు లేదా బీసీ అభ్యర్థి కి ఖరారయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం ఇన్ ఛార్జ్ గా ఉన్న కె భరత్ కు ఖాయమని తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. భరత్ తో పాటుగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు పేరు పరిశీలనలో ఉంది.

విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక, విశాఖ నుంచి నామినేటెడ్ పదవి ఆశించిన వంశీకృష్ణ తో పాటుగా వరుదు కళ్యాణి కి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. వీటని అన్నింటినీ పూర్తి చేసుకొని కేబినెట్ విస్తరణ దిశగా వెళ్లాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఈ వారంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల పైన క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

English summary
AP legislative council elections notification expecting this week. YSRCP finalising the candidates for their elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X