ఏపీ మీదుగా నడిచే స్పెషల్ ట్రైన్స్ జాబితా ఇదే..
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల కోసం ప్రత్యేక ట్రైన్స్‌ను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక, ఏపీ మీదుగా నడిచే ప్రత్యేక రైలు జాబితా వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై- భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం వివరించారు. ఇక ఈ ప్రత్యేక ట్రైన్స్ ఈ నెల నుంచి జూన్ వరకు కొనసాగనున్నాయి.
06073 నెంబర్‌గల ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ ప్రత్యేక రైలు మే 6, 13, 20, 27, జూన్ 3 తేదీల్లో అర్ధరాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరుతుంది ఆ తర్వాత రోజు ఉదయం 11.15గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 06074 అనే నెంబర్‌గల భువనేశ్వర్-చెన్నై సెంట్రల్ స్పెషల్ ట్రైన్ మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో రాత్రి 9గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3.42 గంటలకు దువ్వాడ వచ్చి వెళ్తుంది. వీటితోపాటు ఎర్నాకుళం-బ్రహ్మపుర-ఎర్నాకుళం, చెన్నై ఎగ్మోర్-సంత్రాగచ్చి-చెన్నై ఎగ్మోర్ మధ్య వయా దువ్వాడ మీదుగా అన్‌రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.

ఎర్నాకుళం-బ్రహ్మపుర అన్‌రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్..
ఈ నెల 6, 13, 20, 27 తేదీల నుంచి మే 4, 11, 18, 25 తేదీల్లో 06087 అనే నెంబర్‌గల ఎర్నాకుళం-బ్రహ్మపుర అన్‌రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్ రాత్రి 11గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరుతుంది. ఆ మరుసటి రోజు రాత్రి 11.05గంటలకు దువ్వాడ వస్తుంది. తిరిగి అక్కడి నుంచి 11.07గంటలకు బయలుదేరుతుంది. ఈనెల 8, 15, 22, 29, మే 6, 13, 20, 27 తేదీల్లో 06088 అనే నెంబర్‌గల బ్రహ్మపుర-ఎర్నాకుళం అన్‌రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్ మధ్యాహ్నం 12.40గంటలకు బ్రహ్మపురలో బయలుదేరుతుంది. అక్కడి నుంచి సాయంత్రం 6.05గంటలకు దువ్వాడ వస్తుంది. తిరిగి ఆ స్టేషన్ నుంచి 6.07 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు 22 జనరల్ సెకండ్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ లగేజీ/డిజేబుల్డ్ బోగీలతో ప్రయాణిస్తోంది.
ఆరు వేసవి ప్రత్యేక రైళ్లు పొడిగింపు...
వీటితో పాటు మరో ఆరు వేసవి ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది. 07653 అనే నెంబర్‌గల కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైలు ప్రతి గురువారం మే 1 వరకు ప్రయాణిస్తోంది. ఇక, ప్రతి శుక్రవారం తిరుపతి-కాచిగూడ వెళ్లే 07654 నెంబర్‌గల ట్రైన్ మే 2 వరకు నడుస్తోంది. అంతేకాదు శనివారం సికింద్రాబాద్-నర్సాపూర్ వెళ్లే ప్రత్యేక ట్రైన్ (07170) ఏప్రిల్ 27 వరకు పొడిగించింది. నర్సాపూర్-సికింద్రాబాద్ రైలు 07169 నెంబర్‌గల ట్రైన్ ప్రతి ఆదివారం ఏప్రిల్ 28 వరకు రైల్వేశాఖ పొడిగించింది.












Click it and Unblock the Notifications