ఏపీలో వైసీపీ విజయానికి బలమైన కారణం ఇదే: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు మాత్రం ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలలో గెలిచేది ఎవరు? అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపైన ఏపీలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఏపీలో గెలిచేది వైసీపీనే
ఏపీ ఎన్నికల ఫలితాల పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల కాలంలో అనేకసార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ వచ్చే నెలలో వెలువడే ఫలితాలపై జోస్యం చెప్పారు. ఏపీలో మళ్ళీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అని ఆయన మీడియా చిట్ చాట్లో వెల్లడించారు.

This is the main reason for YCP victory in AP KTR interesting comments again

వైసీపీ విజయానికి బాటలు వేసింది ఇదే
ఏపీలో వైసీపీ నే అధికారంలోకి రావడం వెనుక బలమైన కారణం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే వైసిపి విజయానికి బాటలు వేశాయని ఆయన తెలిపారు. ఇక ఇటు తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీకి పక్కగా 7 సీట్లు వస్తాయని తెలిపారు.

తెలంగాణాలో బీఆర్ఎస్ కు 7 స్థానాలు
దీనికి కేసీఆర్ ప్రచారానికి రంగంలోకి దిగడం ప్రధాన కారణం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ చరిష్మా ఇంకా అలానే ఉందని, అది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏడు సీట్లు తెస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే తాను ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న 17 స్థానాలపై సర్వే చేయించానని తెలిపిన ఆయన అందులో 7 సీట్లు పక్కాగా బీఅర్ఎస్ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కు కేవలం ఒక్క స్థానమే
అదే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. నిజామాబాద్, ఆదిలాబాద్,కరీంనగర్ లో బీఆర్ఎస్, బీజేపీ ల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఉనికి కూడా లేదని కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+