వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మంగ్లీకి ఎస్‌వీబిసి సలహాదారు పదవి ఇవ్వటంలో మతలబు ఇదే.. తెలుగురాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ!!

|
Google Oneindia TeluguNews

సింగర్ మంగ్లీ ని ఎస్విబిసి సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. నిన్నగాక మొన్న సింగర్ గా పరిచయమైన మంగ్లీ కి ఎస్విబిసి సలహాదారుగా అంత పెద్ద అవకాశం ఎందుకిచ్చారు అన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జోరుగా సాగుతుంది. మంగ్లీ కి ఇంత పెద్ద అరుదైన గౌరవాన్ని జగన్ ఎందుకు ఇచ్చారు? ఎస్విబిసి వంటి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భక్తి ఛానల్ కు ఆమెను సలహాదారుగా నియమించడం ఎంతవరకు సమంజసం అన్నది? దీని వెనుక మతలబు ఏంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీ..నెలకు లక్ష రూపాయల వేతనం

ఎస్వీబీసీ సలహాదారుగా మంగ్లీ..నెలకు లక్ష రూపాయల వేతనం


ఎవరూ ఊహించని విధంగా సింగర్ మంగ్లీ ని ఎస్విబిసి సలహాదారుగా నియమించి, నెలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. 28 ఏళ్ల వయసులోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా మంగ్లీ కి ఊహించని అవకాశాన్ని కల్పించారు. వాస్తవానికి మార్చి నెలలోనే ఆమెను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఇక తాజాగా మంగ్లీ ఈ బాధ్యతలను చేపట్టడంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది. మంగ్లీ విషయంలో ఇప్పటివరకు ఎవరూ ఎటువంటి ప్రకటన చేయకపోవడం, సైలెంట్ గా తాము అనుకున్నది జరిగిపోవడం కూడా తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది.

ఎన్నికల ప్రచారానికి వైసీపీ కోసం కీలకంగా పని చేసిన మంగ్లీ

ఎన్నికల ప్రచారానికి వైసీపీ కోసం కీలకంగా పని చేసిన మంగ్లీ

అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమెకు ఇంత అరుదైన అవకాశాన్ని ఇవ్వడం వెనుక మతలబు ఉందని చర్చ జరుగుతుంది. గతంలో ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం మంగ్లీ కీలకంగా పని చేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాలకు మంగ్లీ విశేషంగా కృషి చేశారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఎన్నో పాటలు పాడారు. జగనన్న పేరుతో ఆమె పాడిన పాటలన్నీ చాలా పాపులర్ అయ్యాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రచార సభల్లోనూ, జగన్ రాక ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ మంగ్లీ పాత్ర కచ్చితంగా ఉండేది.

జగన్ మంగ్లీకి అవకాశం ఇవ్వటం వెనుక మతలబు ఇదే

జగన్ మంగ్లీకి అవకాశం ఇవ్వటం వెనుక మతలబు ఇదే


ఇక ఆ కారణాలతోనే తాము అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన మంగ్లీ కి ఎస్విబిసి సలహాదారుగా ఊహించని అవకాశాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు రెండేళ్ల పదవీ కాలం ఉండేలాగా జీవో ఇచ్చారు. రెండేళ్ల పాటు నెలకు లక్ష రూపాయల చొప్పున ఆమెకు చెల్లించేలా ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీంతోపాటు ఎస్విబిసి కి సలహాదారు కావడంవల్ల మంగ్లీ తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆమెకు వసతి సౌకర్యాలను కల్పించడం, ప్రయారిటీ బ్రేక్ దర్శనం కల్పించడం వంటివి చేయనున్నారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో సహకరించినందుకు, ప్రచారంలో తనదైన మార్కు మంగ్లీ చూపించినందుకు ప్రతిఫలంగా జగన్మోహన్రెడ్డి ఈ అవకాశం ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది.

మంగ్లీ ఎస్వీబీసీ సలహాదారుగా నియామకంపై పలువురి అసహనం

మంగ్లీ ఎస్వీబీసీ సలహాదారుగా నియామకంపై పలువురి అసహనం


అయితే హిందూ ధర్మానికి పెద్దపీట వేసి, తిరుమల తిరుపతి దేవస్థానం తో పాటు ఆలయాల విశేషాలను, భక్తి కార్యక్రమాలను నిర్వహించే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు మంగ్లీ ని సలహాదారుగా నియమించడం పైన పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఎన్నికల సమయంలో సహాయం చేసి ఉంటే అందుకు వేరే విధంగా కృతజ్ఞత తెలియజేయవచ్చు కానీ ఎంతో కీలకమైన సలహాదారుల పదవులు కట్టబెట్టడమేనా అంటూ ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు.

హిట్లర్ కూడా నీలానే.. చంద్రం అన్నయ్యా ఇదేం ఖర్మ: ఎంత మాట అనేశాడు సాయిరెడ్డి!!హిట్లర్ కూడా నీలానే.. చంద్రం అన్నయ్యా ఇదేం ఖర్మ: ఎంత మాట అనేశాడు సాయిరెడ్డి!!

English summary
There is an interesting debate in the Telugu states that Mangli was given the post of adviser to SVBC because Mangli worked for YSRCP during the last election campaign and Jagan given this post to her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X