ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామం.. రెండు శతాబ్దాలుగా దీపావళికి దూరం...
దేశమంతా దీపావళి వెలుగులు వెదజల్లుతుంటాయి. అయితే, కొన్ని గ్రామాల్లో మాత్రం దీపావళి సందర్శంగా చీకట్లు మొదలయ్యాయి. ఈ పండుగను చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామం మాత్రం ఏన్నో ఏళ్లనుంచి దీపావళి పండగను జరుపుకోవడం లేదు. దేశమంతా పిల్లపాపలతో కలసి సందడిగా చేసుకునే ఈ పండుగను ఈ గ్రామం మాత్రం రెండు శతాబ్దాలుగా దూరంగా ఉంది. కారణాలు ఏవైనా కానీ దీపావళి వెలుగులు మాత్రం ఇక్కడ కనిపించడం లేదు.
200ఏళ్ల కిందట జరిగిన కొన్ని ఘటనలు : ఆంధ్రప్రదేశ్‌లోని రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో 200ఏళ్ల కిందట జరిగిన కొన్ని ఘటనల వల్ల అక్కడి ప్రజలు దీపావళి పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లతరబడి వస్తున్న ఆచారాల కారణాంగా ఇక్కడి వారు ఆ కట్టుబాట్లను పాటిస్తూ దీపావళి పండుగతోపాటు, నాగుళచవితిని కూడా నిర్వహించుకోవడం లేదు. పున్నానపాలెం గ్రామంలో సుమారు 400 కుటుంబాలు, 1600 మంది జనాభా కలిగి ఉన్నారు. అయిన్నప్పటికీ ఈ గ్రామస్థులు ఇక్కడి ఆచారాలకు కట్టుబడి ఉన్నారు.

కారణం ఇది : గత 200 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో దీపావళి పండుగ రోజు ఒకరిద్దరు చనిపోయారు. అదే రోజు రెండు ఎద్దులు కూడా మరణించాయి. ఆ తర్వాత నాగుల చవితినాడు పుట్టలో పాలుపోసి వచ్చేసరికి ఓ ఇంట్లో ఉయ్యాలలో ఉన్న పిల్లాడు పాము కాటుకి బలయ్యాడు. ఆ రోజు నుంచి ఈ గ్రామస్థులు దీపావళి పండుగ సంబరాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే మూఢనమ్మకంగా మారింది. నేటి యువత కూడా పెద్దల మాట తీసిపోలేక వారి మాటకే కట్టుబడి ఉన్నారు.
దీపావళి పేరుతో మరో గ్రామం : శ్రీకాకుళానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గార మండలంలో దీపావళి పేరుతో ఓ గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఈ పేరు పెట్టడానికి ఓ విచిత్రమైన కారణం ఉంది.. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఈ గ్రామం మీదుగా వెళ్తూ సృహతప్పిపడిపోయాడట. ఆ రాజుకు ఈ గ్రామస్థులు సపర్యలు చేసి ఆయన ప్రాణాలను కాపాడరట. తన ప్రాణదీపాన్ని నిలబెట్టినందుకు ఆ రాజు కృతజ్క్షతగా ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టినట్లు ఇక్కడి వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications