ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్: సంక్రాంతి తర్వాత కేసీఆర్ దూకుడే

అమరావతి: భారత నిర్మాణంలో ఏపీ ప్రజలు కూడా బీఆర్ఎస్‌లో భాగస్వాములు కావాలన్నారు భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్. సోమవారం ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావు తోపాటు భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో పలువురు కీలక నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.

ఏపీ నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీ నాయకులు, ప్రజలు బీఆర్ఎస్‌ను స్వాగతిస్తుండటం మంచి పరిణామమని అన్నారు. ఏపీతోపాటు పలు రాష్ట్రాల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయన్నారు. సంక్రాంతి తర్వాత ఉరుకులు పరుగులు ఉంటాయన్నారు. రావెల కిషోర్ బాబు, పార్థసారథి, చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లోకి రావడం శుభపరిణామమని అన్నారు. రావెల తనతోపాటు జాతయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్


వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంచి ప్రారంభం జరిగిందన్నారు కేసీఆర్.
ఆంధ్రప్రదేశ్ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కర్తవ్య నిర్వహణలో విజయం సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు. విజయం సాధిస్తారన్నారు. సంక్రాంతి పెద్ద పండగ తర్వాత తన ఆఫీసు కంటే ఏపీ ఆఫీసు ఎక్కువగా బిజీ అవుతుందని కేసీఆర్ అన్నారు. చాలా మందికి ఆశ్చర్య కలిగించే చేరికలుంటాయన్నారు. సిట్టింగ్ లు కూడా వస్తామంటున్నారని తెలిపారు.

సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ దూకుడే.. 7,8 రాష్ట్రాల్లో ఆఫీసులు

సంక్రాంతి తర్వాత 7,8 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు తెరుచుకుంటాయని కేసీఆర్ తెలిపారు. ఏపీ నేతల సేవలు వినియోగించుకుంటామని అన్నారు.తాజాగా, బీఆర్ఎస్‌లో చేరిన నేతలు వజ్రాలంటూ కొనియాడారు. ఇలాంటి నేతలు కలిసి రావడం మంచి పరిణామమని అన్నారు. ప్రత్యేక తరగతులు జరుగుతాయన్నారు. ఓర్వలేని వాళ్లు.. భయపడేవాళ్లు మనమీద విమర్శలు చేస్తారన్నారు. అవన్నీ పట్టించుకోవద్దన్నారు. మనం ముందుకే వెళ్లాలన్నారు. కార్యకర్తల భోజనం చేసి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్నారు. ఏపీ నుంచి వచ్చినవారందరికీ స్వాగతం తెలిపారు కేసీఆర్. జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+