బిజెపితో కుమ్మక్కైనట్లుగా, కాంగ్ ఖతం: డిగ్గీపై తోట ఫైర్

భారతీయ జనతా పార్టీతో సహా ఇతర పార్టీలతో కుమ్మక్కైనట్లుగా దిగ్విజయ్ సింగ్ వ్యవహారం ఉందన్నారు. విభజన నిర్ణయం పైన యూ టర్న్ తీసుకోకుంటే సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ పని ఖతమన్నారు.
దినేష్ రెడ్డిపై శైలజానాథ్
మాజీ డిజిపి దినేష్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తే బాగుండేదని, ఇప్పుడు చేయడం సరికాదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఆయన స్థాయికి ఇలాంటి ఆరోపణలు తగవన్నారు. అత్యవసర సేవల ఉద్యోగులు విధులు మినహాయించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు కాంగ్రెసు పార్టీ అండగా ఉంటుందన్నారు.
సమైక్యవాదినే: పనబాక
తాను ముమ్మాటికి సమైక్యవాదినేనని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఢిల్లీలో అన్నారు. కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యవాదినే అయినా అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. సీమాంధ్రకు అన్యాయం చేస్తే ఒప్పుకోమన్నారు.












Click it and Unblock the Notifications