భారత్ నెట్ క్రింద ఏపీలో ఎన్ని వేల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలు లభిస్తాయంటే
Recommended Video
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 బడ్జెట్లో డిజిటల్ ఇండియాకు ప్రాధాన్యత ఇచ్చినట్టు భారత్ నెట్ ద్వారా లక్ష గ్రామ పంచాయితీలను అనుసంధానిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే . భారత్ నెట్ కోసం.. రూ.6000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఇక ఏపీలో ఎన్ని వేల గ్రామాల్లో భారత్ నెట్ ద్వారా ఉచిత బ్రాడ్ బ్యాడ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయంటే

భారత్ నెట్ ను దేశాలో విస్తరించనున్న కేంద్ర సర్కార్
ఇక ఈ భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా 1.3 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించిన కేంద్ర సర్కార్ దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది . డిజిటల్ ఇండియాని లక్ష్యంగా పెట్టుకుని కేంద్రం పని చేస్తుంది. గ్రామాల్లోనూ అందరికీ ఇంటర్ నెట్ వినియోగంలోకి తీసుకురాగలిగితే డిజిటల్ లావా దేవీలను కొనసాగిస్తారని భావిస్తున్న సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తుంది.

ఏపీలో భారత్ నెట్ ద్వారా 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ లో భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభలో తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ధోత్రే రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం పేర్కొన్నారు . దేశంలోని రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను కలుపుతూ దశలవారీగా బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పించాలన్నది భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉద్దేశ్యమని ధోత్రే చెప్పారు.

మొదటి దశలో 1722 గ్రామ పంచాయతీలలో పనులు
భారత్ నెట్ మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో 1722 గ్రామ పంచాయతీలలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టినట్లు మంత్రి ధోత్రే చెప్పారు. ఇందులో 1601 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు సిద్ధమయ్యాయని మిగిలిన గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు సంజయ్ ధోత్రే . మొత్తం ఏపీలో 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications