మందకృష్ణ బెదిరింపు, వెనుక సర్వే: తెరాస నేత ఆకుల

మందకృష్ణ వెనుక కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఉన్నారని ఆకుల ఆరోపించారు. ఈ బెదిరింపులతో తన తల్లి తీవ్ర భయాందోళనలకు గురవుతోందన్నారు. సర్వే కోసం ఆయన బెదిరిస్తున్నారన్నారు. తాను చేస్తున్న ఆరోపణలు తప్పని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు.
బెదిరించలేదు: మందకృష్ణ
తాను ఎవరినీ బెదిరించలేదని మందకృష్ణ మాదిగ చెప్పారు. ఆకుల రాజేందర్ ఆరోపణల పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆకుల వెనుక తెరాస అధినేత కెసిఆర్ ఉన్నారని ఆరోపించారు.
జగన్‌ను సిఎం చేయడమే లక్ష్యం: కొణతాల
తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొణతాల రామకృష్ణ గురువారం వేరుగా అన్నారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా తమ పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుండి తమ పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేస్తారని హర్ష కుమార్ అమలాపురంలో అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సీమాంధ్రులు ఉన్నందున ఉండవల్లిని అక్కడి నుంచి పోటీకి పెడుతున్నామన్నామని, ఆయన కూడా సుముఖంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications