కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు సంచలన తీర్పు - రాజధాని మార్పు సాధ్యం కాదు : సీఆర్డీఏ చట్టం ప్రకారమే వెళ్లాలి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో మూడు రాజధానులు.. సీఆర్డీఏ చట్టం పైన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దాదాపు 70 పిటీషన్ల పైన విచారించిన న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అందులో భాగంగా.. కీలక అంశాలను ప్రస్తావించింది. అమరావతి ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తిచేయాలని కోర్టు నిర్దేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

 అభివృద్ధిపరిచిన ప్లాట్లను అప్పగించాలని

అభివృద్ధిపరిచిన ప్లాట్లను అప్పగించాలని

అన్ని సౌకర్యాలతో అభివృద్ధిపరిచిన ప్లాట్లను అప్పగించాలని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అదే సమయంలో అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖాకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే ససమయంలో పిటీషనర్ ఖర్చులకు రూ 50 వేలు చొప్పున ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సీఆర్డీఏ చట్టంతో పాటుగా రాజధాని మార్పు చట్టాలను మార్చే అధికారం శాసనసభకు.. ప్రభుత్వానికి అధికారం లేదంటూ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసినట్లుగా పిటీషనర్ల తరపు న్యాయవాదులు స్పస్టం చేసారు.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయలి

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయలి

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొందరు న్యాయమూర్తులు ఈ కేసు విచారించవద్దంటూ వచ్చిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని మార్చే అధికారం అసెంబ్లీకి లేదని కోర్టు తేల్చి చెప్పటంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అదే విధంగా డెవలప్ చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వటంతో పాటుగా అన్ని రకాలుగా మౌళిక వసతులు కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది.

అసెంబ్లీకి అధికారం లేదంటూ..

అసెంబ్లీకి అధికారం లేదంటూ..


ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల రద్దు..సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అదే సమయంలో సమగ్రంగా బిల్లులను సభ ముందుకు తీసుకొస్తామని ప్రభుత్వం సభలో స్పష్టం చేసింది. అయితే, న్యాయస్థానం తన తీర్పులో శాసనసభలో రాజధాని మార్పుకు ...సీఆర్డీఐ చట్టం మార్పుకు అధికారం లేదని స్పష్టం చేసినట్లుగా పిటీషనర్ల తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ మేరకు డెవలప్ చేయాలని కోర్టు సూచించింది. ఉన్నది ఉన్నట్లుగా డెవలప్ చేయాలని చెప్పటం ద్వారా ఇప్పుడు హైకోర్టు తీర్పు కీలకంగా మారనుంది.

రాజధాని అవసరాలకే భూమి వినియోగించాలి..

రాజధాని అవసరాలకే భూమి వినియోగించాలి..


అమరావతి పరిధిలో భూసమీకరణ ద్వారా రైతుల నుంచి సమీకరించిన భూముల పైనా కోర్టు తీర్పులో స్పష్టత ఇచ్చింది. రాజధాని అవసరాలకే భూమిని వినియోగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు కీలకంగా ప్రస్తావించింది. సీఆర్డీఏ చట్టం రద్దు ప్రభుత్వం ఇప్పటికే ఉప సంహరించుకోవటం ద్వారా.. ఈ పిటీషన్లను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ తరపున వాదనలు వినిపించారు. అయితే, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వం తిరిగి మూడు రాజధానుల బిల్లుల విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తుంది లేదా ఈ తీర్పు పైన అప్పీల్ కు వెళ్తుందా అనేది తేలాల్సి ఉంది.

రైతులకు న్యాయం చేయాల్సిందే..

రైతులకు న్యాయం చేయాల్సిందే..


రైతులు ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే సమయంలో చేసుకున్న ఒప్పందాల మేరకు వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని తేల్చింది. ఇందు కోసం ప్రభుత్వానికి సమయం నిర్దేశించింది. అన్నింటి కంటే కీలకంగా రాజధాని పైన చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పటం ద్వారా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ అంశంలో ఏ రకంగా స్పందిస్తుదనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
In a big shcok AP High court had directed Jagan govt to follow according to the CRDA law over three capitals concept
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X