కేరళ: డ్రైనేజీలో పడి ఆటో డ్రైవర్ తోపాటు ఇద్దరు ఏపి కార్మికుల మృతి(వీడియో)
కోజికోడ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లోని పాలయం సమీపంలోని ఓ డ్రైనేజీలో పడి మృతి చెందారు. గురువారం జరిగిన ఈ ఘటనలో ఏపి కార్మికులతోపాటు కేరళకు చెందిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు.
డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో నీటిలో పడిపోయి ఇద్దరు కార్మికులు కొట్టుమిట్టాడుతుండగా.. వారిని కాపాడేందుకు ఓ ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చాడు. ప్రమాదవశాత్తు అతను కూడా వారితోపాటు నీళ్లలో పడిపోయాడు.
Video Courtesy : REPORTER LIVE
దీంతో వారు ముగ్గురు కూడా డ్రైనేజీ నీటిలో ఊపిరాడక మృతి చెందారు. ఆటో డ్రైవర్‌ను పి. నౌషద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. 2013లో కోచికోడ్‌లో ఓపెన్ నాలాలో పడి ఓ మహిళ మృతి చెందింది.












Click it and Unblock the Notifications